Uric Acid Control Diet: యూరిక్ యాసిడ్ నొప్పుల నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా శాశ్వతంగా చెక్‌..

How To Control Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల చాలామందిలో కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పుల సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి నొప్పులతో బాధపడేవారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2022, 03:49 PM IST
  Uric Acid Control Diet: యూరిక్ యాసిడ్ నొప్పుల నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా శాశ్వతంగా చెక్‌..

How To Control Uric Acid: ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. యూరిక్ యాసిడ్ సమస్యల కారణంగా కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ యూరిక్ యాసిడ్ సమస్యలు శీతాకాలంలో కూడా సులభంగా వస్తాయి. ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అధిక పరిమాణంలో ప్రోటీన్లు కలిగిన ఆహారాన్ని కూడా ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జీడిపప్పు:
జీడిపప్పుల్లో శరీరానికి కావాల్సిన పొటాషియం ఫైబర్ విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే సులభంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా యూరిక్ యాసిడ్ ను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజు జీడిపప్పులను ఉదయం పూట తినాల్సి ఉంటుంది.

వాల్ నట్స్:
ఆయుర్వేద శాస్త్రంలో వాల్ నట్స్ ని సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం అధికంగా ఉంటుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వాల్ నట్స్ ను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. 

బాదం:
బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్య నిపుణులు వీటిని తినమని సూచిస్తారు. అయితే ఇందులో ఉండే గుణాలు యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో యూరిక్ ఆసిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.

అవిసె గింజలు:
అవిసె గింజల్లో శరీరానికి అవసరమైన కొవ్వులు ఆమ్లాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు కలగడమే కాకుండా బాడీ దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా యూరిక్ యాసిడ్ను సులభంగా నియంత్రిస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Salman Pooja Dating: సల్మాన్‌ ఖాన్‌తో పూజా హెగ్డే ప్రేమాయణం.. ఇదేక్కడి లింక్ రా బాబు.. ట్వీట్ వైరల్  

Also Read: Himachal Pradesh Election Result: హిమాచల్ ప్రదేశ్‌లో హోరాహోరీ.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ తిప్పలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News