/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Foods to avoid if you're having Severe headache: ఏయే రకాల ఆహారం తీసుకుంటే తలనొప్పి వస్తుందనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి.. ఆహారం కూడా తలనొప్పికి కారణం అవుతుందా అని ఆశ్చర్యపోతున్నారా ? అవును మీరు చదివింది నిజమే. కొంతమంది విషయంలో దీర్ఘకాలిక తలనొప్పికి ఆహారం కూడా ఓ కారణమే అవుతుందంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. 

కొంతమందిని అప్పుడప్పుడు దీర్ఘకాలిక తలనొప్పి వేధిస్తుంటుంది. అయితే ఆ తలనొప్పి విపరీతమైన ఒత్తిడి లేదా ఇతర వంశపారంపర్య కారణాలతో వస్తుందేమో అనే చాలామంది భావిస్తారు. కానీ కొన్నిరకాల ఆహారాలు కూడా భరించలేని తలనొప్పికి కారణమవుతాయనే విషయం చాలామందికి తెలియదు. స్వీట్లు లేదా కార్బోహైడ్రేట్లను తీసుకున్న తర్వాత భరించలేని తలనొప్పి వేధిస్తుంటుంది. అయితే ఈ పరిస్థితి అందరిలో కనిపించదు. ఫుడ్ ఎలర్జీతో బాధపడే వారిలో కొంతమందికి మాత్రమే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు మైగ్రేన్ నొప్పికి కూడా కొన్నిరకాల ఆహారమే కారణం అవుతుందట.

పోషకాహార నిపుణులు అంజలి ముఖర్జీ వెల్లడించిన వివరాల ప్రకారం, " కొన్నిసార్లు వాతావరణ మార్పులు, ఘాటైన వాసనలు, పర్‌ఫ్యూమ్స్, ఎక్కువ కాంతిని వెదజల్లే లైట్లు, ఆడవారిలో మెన్సస్ సైకిల్ కూడా తలనొప్పికి కారణం అవుతుంటాయి. ఇందులో చాలా వాటిని మనం నియంత్రించలేం కానీ మనం తినడానికి ఎంచుకునే ఆహారం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకోకపోతే మనం తలనొప్పికి, మైగ్రేన్ నొప్పికి దూరంగా ఉండొచ్చు తెలుసుకుంటే వాటిని అవాయిడ్ చేయడానికి వీలు ఉంటుంది.

తలనొప్పికి కారణమయ్యే 7 రకాల ఆహారాలు జాబితా ఇదిగో..

రెడ్ వైన్: రెడ్ వైన్ ని తీసుకునే మోతాదును బట్టి అది తలనొప్పికి కారణం అవుతుంది. రెడ్ వైన్ పడని వారు మోతాదుకి మించి తీసుకుంటే అది తలనొప్పికి దారితీయొచ్చు.

జున్ను: ఇందులో ఉండే టైరమైన్ రక్తనాళాలు కుచించుకుపోయేలా చేస్తుంది. రక్తనాళాలు కుచించుకుపోవడం కారణంగా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.

చాక్లెట్: రోజుకు నాలుగైదు చాక్లెట్స్ లేదా అంతకుమించి ఎక్కువ ఛాక్లెట్స్ తినడం వల్ల అందులో ఉండే కెఫిన్, టైరమైన్‌తో భరించలేని తలనొప్పి వస్తుంది.

పాలు: పాలతో కూడా తలనొప్పి వస్తుందా అని అనుకోకండి. ఒకవేళ మీరు పాలలో ఉండే లాక్టోస్ పడనట్టయితే.. పాలు తీసుకున్న తర్వాత కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉందట. అయితే ఇది చాలా అరుదుగా కనిపించే లక్షణం.

సిట్రస్ ఫ్రూట్స్: సిట్రస్ ఫ్రూట్స్ లో ఆక్టోపమైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది తలనొప్పిని ప్రేరేపిస్తుంది. సిట్రస్ ఫ్రూట్స్ ఎలర్జీ ఉన్న వాళ్లు నారింజ, స్వీట్ లైమ్, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు కూడా తలనొప్పిని దారితీయొచ్చు.

కృత్రిమ స్వీట్లు: కృత్రిమ స్వీట్లలో అస్పర్టం ఉంటుంది. ఇది శరీరంలో డోపమైన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇతరత్రా: క్యాబేజీ, వంకాయ, క్యూర్డ్ మీట్స్, క్యాన్డ్ ఫిష్, పచ్చి వేరుశనగలు లాంటివి కొంతమందికి తలనొప్పి కలిగిస్తాయి. చాలామంది గమనించే ఉంటారు పచ్చి పల్లీలు తిన్నప్పుడు పైశ్చంగా మారి తలనొప్పి రావడం. ఇవి కూడా అలాంటివే అన్నమాట. 

ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే తలనొప్పి వస్తుంది అని గుర్తించినట్టయితే.. అలాంటి ఆహారాలకు దూరంగా ఉండటమే బెటర్. లేదంటే తలనొప్పితో ( Frequent Headache ) బాధపడకతప్పదనేది హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం.

Also Read : Cholesterol: కొలెస్ట్రాల్ ఎంతవరకూ ప్రమాదకరం, ఏయే వ్యాధుల ముప్పు ఉంటుంది

Also Read : Cardamon Benefits: రోజూ తీసుకుంటే..అధిక రక్తపోటు, కేన్సర్, బ్లడ్ షుగర్ సమస్యలకు చెక్

Also Read : Cervical Problems: ఆ నొప్పి అత్యంత భయంకరం. వచ్చిందంటే బతుకు దుర్భరమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Section: 
English Title: 
foods which cause to headache, foods to avoid if you are having severe headache and migraine pain
News Source: 
Home Title: 

Foods and Headache: భరించలేని తలనొప్పి వేధిస్తుందా ? ఇవి తింటున్నారా ?

Foods and Headache: భరించలేని తలనొప్పి వేధిస్తుందా ? ఇవి తింటున్నారా ?
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

కొన్నిరకాల ఆహారాలు కూడా తలనొప్పికి కారణం అవుతాయని తెలుసా ?

దీర్ఘకాలిక తలనొప్పి, మైగ్రేన్ నొప్పికి ఆహారానికి లింకుందా ?

ఎలాంటి ఆహారం తలనొప్పికి కారణం అవుతుంది

Mobile Title: 
Foods and Headache: భరించలేని తలనొప్పి వేధిస్తుందా ? ఇవి తింటున్నారా ?
Pavan
Publish Later: 
No
Publish At: 
Monday, November 28, 2022 - 17:56
Request Count: 
55
Is Breaking News: 
No