Mangal Transit In Taurus 2022: జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని ధైర్యాన్ని ఇచ్చే గ్రహంగా భావిస్తారు. దీనిని రెడ్ ఫ్లానెట్, క్రూర గ్రహమని కూడా పిలుస్తారు. ఈనెల 13న కుజుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. 2023 మార్చి 13 వరకు అదే రాశిలో ఉంటాడు. వృషభరాశికి అధిపతి శుక్రుడు. వీనస్ యెుక్క రాశిలో కుజుడి సంచారం (Mars Transit In Taurus 2022) ముఖ్యంగా మూడు రాశులవారికి ఆకస్మిక ధనలాభం మరియు కెరీర్‌లో పురోగతిని ఇస్తుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మేషం (Aries): కుజుడు రాశి మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మంగళ్ దేవ్ మీ రాశి నుండి రెండవ ఇంట్లో ప్రయాణిస్తున్నాడు. అందుకే ఈ సమయంలో మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందవచ్చు. అలాగే కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. మీ కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది. మేష రాశికి కుజుడే అధిపతి. కాబట్టి అంగారక సంచారం ఈ రాశివారికి మేలు చేస్తుంది.
వృషభం (Taurus): అంగారకుడి సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి లగ్నంలో జరిగింది. దీంతో మీరు పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మంచి లాభాలను గడించవచ్చు. ఈ సమయంలో మీ మనోబలంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే సూపర్ గా ఉంటుంది. లైఫ్ పార్టనర్ సహకారం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. బిజినెస్ స్టార్ చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం.
మకరం (Capricorn): కుజుడు సంచారం మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో కుజుడు నాల్గవ మరియు పదకొండవ ఇంటికి అధిపతి మరియు కుజుడు ఐదవ ఇంట్లో తిరోగమన స్థితిలో మాత్రమే సంచరిస్తాడు. దీంతో సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. విదేశాలకు వెళ్లాలనుకునువారి కల నెరవేరుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు కూడా ఈసమయం బాగానే ఉంటుంది.
Also Read: Budh Gochar 2023: వచ్చే ఏడాది నుంచి ఆ 3 రాశులకు ఖజానా నిండటం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook