IT Raids on Minister Malla Reddy House: మంత్రి మల్లారెడ్డి నివాసంలో, కార్యాలయాల్లో, సమీప బంధువుల ఇళ్లలో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 15 గంటలకు పైగా ఐటి సోదాలు కొనసాగుతున్న తీరు చూస్తోంటే.. ఆదాయ పన్ను శాఖ అధికారుల వద్ద స్పష్టమైన సమాచారం ఏదో ఉందని.. వాటి వివరాలు సేకరించేందుకే ఈ స్థాయిలో సోదాలు జరుగుతున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను ఎగవేసిన విషయంలోనే మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదులు అందాయని.. ఆ ఫిర్యాదుల ఆధారంగానే ఐటి అధికారులు సోదాలు చేపట్టారని తెలుస్తోంది.
మల్లారెడ్డి నివాసంతో పాటు మంత్రి వారసులు మహేందర్ రెడ్డి, భద్రా రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మా రెడ్డి, సోదరుడు గోపాల్ రెడ్డి నివాసాల్లోనూ ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు. మల్లారెడ్డికి చెందిన మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, మేనేజ్మెంట్ కాలేజీల ప్రధాన కార్యాలయాల్లోనూ ఐటి అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. 10 సంవత్సరాల నుండి చెల్లించిన ఐటి రిటర్న్స్, ఆయన బ్యాంక్ ఎకౌంట్స్, ఆస్తుల కొనుగోలు, క్రయవిక్రయాలు, ఇతర లావాదేవీలపై ఐటి అధికారులు ఆరా తీస్తున్నారు.
మంగళవారం రాత్రి వరకు జరిగిన సోదాల్లో ఆదాయ పన్ను విభాగం అధికారులు 4 కోట్ల రూపాయల నగదు గుర్తించినట్టు సమాచారం అందుతోంది. రేపు బుధవారం సైతం ఐటి సోదాలు కొనసాగనున్నాయని తెలుస్తోంది.
ఇదిలావుంటే, మంత్రి మల్లారెడ్డి నివాసంపై ఐటి దాడులు జరిపిన నేపథ్యంలో ఈ ఐటి దాడుల వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ మల్లా రెడ్డి అనుచరులు ధర్నాకు దిగారు. మంత్రి మల్లారెడ్డికి మద్దతుగా భారీ సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్న అనుచరులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు.. ప్రధాని మోదీ, బీజేపి నాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి మల్లా రెడ్డి నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు కొంతమంది ప్రయత్నించగా.. అక్కడే ఐటి అధికారులకు బందోబస్తుగా వచ్చిన కేంద్ర బలగాలు వారిని వెనక్కి పంపించాయి. మాట వినకుంటే లాఠీ చార్జ్ చేయడానికైనా వెనుకాడేది లేదని కేంద్ర బలగాలు హెచ్చరించాయి.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నివాసం ముందు అనుచరులు, మద్దతుదారులు ధర్నా చేపట్టడంపై స్పందించిన మంత్రి మల్లా రెడ్డి.. తమ అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. మల్లా రెడ్డి సూచనల నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, ఆందోళనకారులు, మద్దతుదారులు ఆందోళన విరమించి వెళ్లిపోయారు. మొత్తానికి గట్టి భద్రత నడుమ, నిఘా నీడలో మంత్రి మల్లా రెడ్డి ( Minister Malla Reddy ) నివాసంలో సోదాలు చేపట్టిన ఐటి అధికారులు.. ఈ సోదాల్లో ఏం వెలికి తీస్తారోననే ఉత్కంఠ, ఆసక్తి అటు రాజకీయ నాయకుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
Also Read : TRS MLAs Poaching Case: సిట్ విచారణకు రాని వారిపై చర్యలు తప్పవా ?
Also Read : Revanth Reddy: సోమేష్ కుమార్‌ని కలిసిన రేవంత్ రెడ్డి అండ్ టీమ్
Also Read : Traffic New Rules: ట్రాఫిక్ కొత్త రూల్స్.. రాంగ్ సైడ్‌కి 1700, ట్రిపుల్ రైడింగ్ 1200 బాదుడే బాదుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
IT Raids on Malla Reddy House: మంత్రి మల్లారెడ్డి నివాసంలో 15 గంటలకుపైగా ఐటి సోదాలు
మంత్రి మల్లా రెడ్డి నివాసంలో ఐటి సోదాలు
ఇద్దరు కుమారులు, ఇద్దరు సోదరులు, అల్లుడు, వియ్యంకుడి నివాసాల్లోనూ తనిఖీలు
మంత్రి మల్లా రెడ్డి ఇంటి ఎదుట ఉద్రిక్త వాతావరణం