Pawan Kalyan at Rushikonda Beach: నిన్న రాత్రి విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇవాళ సాయంత్రం విశాఖకు స్వర్గధామమైన రుషికొండ బీచ్‌ను ఆనుకుని ఉన్న రుషికొండకు వెళ్లి అక్కడ జరుగుతున్న తవ్వకాలను పరిశీలించారు. విశాఖలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన రుషికొండలో ఏపీ సర్కారు అభివృద్ధి పేరిట నిబంధనలకు విరుద్ధంగా ఋషికొండను అడ్డగోలుగా తవ్వుతోందని మొదటి నుంచి విమర్శిస్తూ వస్తోన్న జనసేనాని... తాజాగా రుషికొండలో జరిగిన తవ్వకాలను దగ్గరుండి పరిశీలించారు. అయితే ఇప్పటికే తవ్వకాలు జరిపిన చోట అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మాణాలు జరుగుతుండటంతో అక్కడ చుట్టూ ఎత్తైన బారికేడ్లు ఏర్పాటు చేసి ఉన్నాయి. నిర్మాణ పనులు జరుగుతున్నందున బారికేడ్లు దాటి లోపలికి వెళ్లలేకపోయారు.
రుషికొండ బీచ్ సమీపంలో గతంలో రామానాయుడు స్టూడియోకు స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా రామా నాయుడు స్టూడియో సమీపంలోని సముద్రతీర ప్రాంతాన్ని సైతం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. సముద్ర తీరంలో మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఋషికొండ పరిసరాల గురించి స్థానికుల నుంచి ఆరాతీశారు. పవన్ కళ్యాణ్ ఋషికొండలో పర్యటిస్తున్నారని తెలుసుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
గతంలో రామానాయుడు స్టూడియోకు అప్పటి ప్రభుత్వం కేటాయించిన భూములను వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకా తిరిగి తీసేసుకుందన్న వార్తల నేపధ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడి పరిసరాలను పరిశీలించడానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకొంది. అంతేకాకుండా రుషికొండపై అభివృద్ధి పనులు చేపట్టిన వైసీపీ సర్కారు.. అక్కడ కోట్ల విలువైన భూములను తమ అనునాయులకు అప్పనంగా అప్పజెప్పిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు.. అక్కడ అభివృద్ధి పనుల్లోనూ బినామి కాంట్రాక్టర్ల పేరుతో అధికార పార్టీకి చెందిన కీలక నేతలే కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై త్వరలోనే తీవ్రస్థాయిలో ఉద్యమం లేవనెత్తడానికే పవన్ కళ్యాణ్ రుషికొండను పరిశీలించారా అనే టాక్ వినిపిస్తోంది. రుషికొండపై తవ్వకాలు, అక్కడి బీచ్ పరిసరాలు పరిశీలించిన అనంతరం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అక్కడి నుంచి నేరుగా తిరిగి నోవోటెల్ హోటల్‌కి చేరుకున్నారు.
Also Read : Case filed on Pawan: కొంప ముంచిన షో ఆఫ్.. కారెక్కిన పవన్ కళ్యాణ్ మీద కేసు?
Also Read : AP CM YS Jagan Speech: సహాయం అందిస్తే..ప్రజలు మిమ్మల్ని సదా గుర్తుంచుకుంటారు
Also Read : Pawan Kalyan Meets PM Modi: ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీ ముఖ్యాంశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
Pawan Kalyan at Rushikonda: పవన్ కళ్యాణ్ రుషికొండ బీచ్‌కి వెళ్లింది అందుకేనా ?