ED Raids in Telangana: గత రెండు రోజులుగా తెలంగాణలో జరిగిన సోదాలపై అధికారికంగా ఈడీ ప్రకటన చేసింది. ఈ నెల 9, 10 తేదీల్లో కరీంనగర్ హైదరాబాదులో సోదాలు నిర్వహించామని.. శ్వేతా గ్రానైట్స్, శ్వేతా ఏజెన్సీస్, వెంకటేశ్వర గ్రానైట్, పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ షిప్పింగ్ సంబంధించిన సంస్థలపై సోదాలు చేశామని తెలిపింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘనపైనే తనిఖీలు జరిపామని ఈడీ వెల్లడించింది. ఈ సంస్థలు హాంకాంగ్ చైనా దేశాలతో పాటు ఇతర దేశాలకు గ్రానైట్ బ్లాక్ ఎగమతి చేస్తున్నాయని తెలిపింది.
తమ విచారణలో రాయల్టీ చెల్లించిన పరిమాణం కంటే ఎగుమతి చేసిన పరిమాణం ఎక్కువగా ఉందని తేలిందని ఈడీ స్పష్టం చేసింది. ఎగుమతి ఆదాయం బ్యాంకు ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా తీసుకుంటున్నారని గుర్తించామని పేర్కొంది. రెండు రోజులు జరిపిన సోదాల్లో కోటి 8 లక్షల రూపాయలు హవాలా రూపంలో పొందినట్లు గుర్తించామని తెలిపింది.
పది సంవత్సరాల డిస్పాచ్ డేటాను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. ఉద్యోగుల పేరుతో అనేక బినామీ ఖాతాలను ఈడీ అధికారులు గుర్తించారు. చైనా సంస్థల నుంచి పత్రాలు లేకుండా రుణాల రూపంలో భారతీయ సంస్థలకు మళ్లించినట్లు తేల్చారు. రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా అక్రమ గ్రానైట్ మైనింగ్ ఫెమా ఉల్లంఘన దర్యాప్తును ప్రారంభించామని వెల్లడించింది. రైల్వే ద్వారా ఓడరేవులకు గ్రానైట్ బ్లాకులు తరలించినట్టు ఈడీ తెలిపింది.
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి మీద ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల మునుగోడు ఎన్నికల తరువాత తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ దూకుడుగా వ్యవహారిస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి సీఎం కేసీఆర్ వీడియోలు బయటపెట్టారు. తమ నేతల మీద సీబీఐ సహా ఐటీ, ఈడీ దృష్టి పెట్టే అవకాశం ఉందని టీఆర్ఎస్ ముందు నుంచే ఆరోపిస్తున్నారు. అందుకు తగినట్లుగానే.. గంగుల కమలాకర్ మీద ఐటీ, ఈడీ దాడులు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక వ్యక్తుల అరెస్ట్ తెలంగాణలో కలకలకం రేపుతోంది.
సీబీఐ నేరుగా రాష్ట్రంలో ఎలాంటి విచారణ చేసే అధికారం లేకుండా ప్రభుత్వం జీవో తీసుకొచ్చిన నేపథ్యంలో ఐటీ, ఈడీ అధికారులను రంగంలోకి దింపింది.
Also Read: Rajiv Gandhi Murder Case: సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం.. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు విడుదల
Also Read: టీ20 ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన.. గణాంకాలు చూస్తే అభిమాని గుండె బద్దలవ్వాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి