AP Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రెండు మూడు రోజులుగా చెదురు ముదురు వానలు కురుస్తున్నాయి..ఈ నేపథ్యంలో నేడు కూడా ఏపీలోని నాలుగు ప్రధాన జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం నేడు ఉందని ఐఎండి హెచ్చరిక చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షం పడే అవకాశం ఉంది అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. నిన్న కూడా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. దీంతోపాటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలోని ప్రకాశం బాపట్ల, పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి వంటి ప్రధాన జిల్లాల్లో వర్షాలు రెండు రోజులుగా కురుస్తున్నాయి. వరి కోతకి వెళ్లే రైతులు ఈ నేపథ్యంలో జాగ్రత్త తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది.
ఇప్పటికే తుఫాను నేపథ్యంలో రైతులు ఆందోళనలో ఉన్నారు. వరి కోతకు వెళ్తున్నారు అంతేకాదు వారు ధాన్యం కూడా రోడ్డు పక్కన ఆరబెడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి.
అయితే ఏపీలోని కోనసీమ, బాపట్ల, కృష్ణ, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో నేడు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.ఇక పల్నాడు అన్నమయ్య చిత్తూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక తెలంగాణలో కూడా వర్షం అక్కడక్కడ చెదురుమదురుగా పడుతున్నాయి. ఉష్ణోగ్రత స్థాయిలో ఒక్కసారిగా పడిపోయాయి రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం తిరిగి మాములు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.