CM KCR: ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ స్కెచ్.. కేసీఆర్ సంచలన కామెంట్స్.. వైసీపీ గేమ్ ప్లాన్ ఏంటి..?

CM KCR On TRS MLAS Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ బయటపెట్టిన వీడియోలు ప్రకంపనలు రేపుతున్నాయి. తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో కుట్ర జరుగుతోందని ఆరోపించిన నేపథ్యంలో ఏం జరుగుతోందనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2022, 08:10 AM IST
CM KCR: ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ స్కెచ్.. కేసీఆర్ సంచలన కామెంట్స్.. వైసీపీ గేమ్ ప్లాన్ ఏంటి..?

CM KCR On TRS MLAS Poaching Case: తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ వీడియోలతో సహా కుట్రను బట్టబయలు చేయడంతో సంచలనం రేకిత్తిస్తోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ ప్రభుత్వాలను కూల్చేందుకు ప్లాన్ చేస్తున్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అలజడి నెలకొంది. ఇప్పటికే దేశంలో 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయనని.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా దేశాన్ని నడిపించాల్సిన అగ్రనేతలే బాధ్యారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు.

కుట్రలో ఏపీకి కూడా ఉందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ రియాక్షన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేని ఆంధ్రప్రదేశ్‌లో బలమైన వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై ఎప్పుడు పెద్దగా వివర్శలు చేయని జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తుందనే ఆలోచన మొదలైంది. కేంద్రం తీసుకునే అన్ని నిర్ణయాలకు వైసీపీ మద్దతు తెలుపుతున్నందున ఆ సాహాసం చేయకపోవచ్చని నిపుణులు అంటున్నారు. 

కేసీఆర్ కామెంట్స్‌తో వైసీపీలో చర్చనీయాంశంగా మారినా.. తమ ప్రభుత్వం జోలికి వచ్చే ధైర్యం లేదని ఆ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఎందుకైనా మంచిదని ముందుగానే అక్కడ అధిష్టానం కాస్త అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌కు జగన్‌కు మధ్య సత్సంబంధాలు ఉండడంతో ముందే అలర్ట్ చేశారనే చర్చ కూడా జరుగుతోంది. ఏపీలో ఇంటెలిజెన్స్ విభాగం చాలా యాక్టివ్‌గా ఉండడంతో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో జగన్‌కు సమాచారం వెళుతుంది. ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అయ్యే అవకాశాలు దాదాపు లేనట్లే..

ఇక రాజస్థాన్ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మొత్తం     200 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అధికార పార్టీకి చెందిన వారు 108 మంది ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు 71 మంది ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినా.. సక్సెస్ అవుతుందని నమ్మొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కూడా చాలా బలంగా ఉంది. మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో ఆప్ ఎమ్మెల్యేలు 62 మంది ఉన్నారు. ఇందులో బీజేపీ ఎమ్మెల్యేలు కేవలం 8 మందే ఉన్నారు. ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని కూల్చడం అంత తేలికకాదు. కేసీఆర్ వ్యాఖ్యలు నాలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చ నడుస్తోంది.

Also Read: CM KCR Press meet: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల దృశ్యాలు.. బిగ్ స్క్రీన్‌పై బీజేపికి సినిమా చూపించిన కేసీఆర్

Also Read: Munugode Exit Polls: మునుగోడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో 2 ప్రధాన పార్టీలకు షాక్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News