Sangareddy Accident: ఇవాళ సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం కన్సాన్ పల్లి శివారులో ఆర్టీసీ బస్సు, కారు (RTC Bus- Car collision in Sangareddy) ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పొగమంచు వల్ల రోడ్డు సరిగా కనిపించకపోవడమే యాక్సిడెంట్ కు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. చలికాలం వచ్చేసింది కాబట్టి వీలైనంత వరకు తెల్లవారుజాము ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.
రోడ్డు ప్రమాదంలో వైద్యురాలు మృతి
మహారాష్ట్రకు చెందిన సురేఖ బార్లోటా (46) అనే వైద్యురాలు మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం సోన్ మండలం గంజాల్ గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఈమె తన భర్త పీయూష్, బంధువులు అనిత, మీనల్, అదితి మరియు పూజతో కలిసి హైదరాబాద్ నుంచి యవత్‌మాల్‌కు వెళ్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈమె యవత్మాల్ జిల్లా కేంద్రంలో ప్రముఖ గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. క్షతగాత్రులను నిర్మల్‌లోని ఆసుపత్రికి తరలించి సాయంత్రం డిశ్చార్జి చేశారు.
Also Read: Stop Line Violations: వాహనదారులకు బిగ్ అలర్ట్.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook