/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

చలికాలంలో సాధారణంగా శరీరంలోని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అందుకే చలికాలంలో వివిధ రకాల వ్యాధులకు గురవుతుంటారు. పలు ఇన్‌ఫెక్షన్లు దాడి చేస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో ఇమ్యూనిటీని పెంచే ఔషధం కూడా ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

ఇమ్యూనిటీని పెంచేందుకు ముఖ్యంగా కావల్సింది విటమిన్ సి. ప్రకృతిలో లభించే కాయల్లో విటమిన్ సి సమృద్ధిగా లభించేది ఉసిరికాయ. ఉసిరి ప్రతిరోజూ తీసుకుంటే..రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వివిధ రకాల రోగాలు దూరమౌతాయి. ఇమ్యూనిటీ బాగుంటే..ఏ విధమైన రోగాలు చేరవు. అందుకే ఎప్పటికప్పుడు బలవర్ధకమైన ఆహార పదార్ధాల ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవల్సిన అవసరం ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రంలో ఉసిరికి ప్రత్యేక స్థానముంది. ఇది ఔషధ గుణాల పొదరిల్లు. అందుకే ఉసిరికాయ జ్యూస్ తాగితే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. 

ఉసిరికాయను విటమిన్ సికు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పవచ్చు. ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సి అనేది చాలా రకాల రోగాల్నించి కాపాడే అద్భుతమైన విటమిన్. అందుకే ఉసిరికాయ జ్యూస్ రోజూ డైట్‌లో చేర్చుకుంటే..అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కడుపు, లివర్‌లను ఆరోగ్యంగా ఉంచడంలో ఉసిరికాయ పాత్ర అమోఘమైంది. చలికాలంలో ఎదురయ్యే పలు వ్యాధుల్నించి రక్షించడంలో ఉసిరి పాత్ర కీలకం.

ఉసిరికాయను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.  మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంలో ఉసిరికాయలు సూపర్ ఫుడ్‌గా పనిచేస్తాయి. ఉదయం పరగడుపున ఉసిరి జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఉసిరికాయ రోజూ డైట్‌లో భాగంగా చేసుకుంటే..ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంటారు. 

దీనికోసం ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఉసిరి జ్యూస్ తీసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగవడమే కాకుండా..బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఉసిరి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం మెటబోలిజం వృద్ధి చెందడం ద్వారా స్థూలకాయం సమస్యకు చెక్ పెట్చవచ్చు.

Also read: Muscle pains: మజిల్ పెయిన్స్ బాధిస్తుంటే ఇలా చేయండి చాలు, ఎంత నొప్పైనా లాగేస్తుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Amla health benefits and tips to improve immunity in winter add amla in your diet
News Source: 
Home Title: 

Amla Benefits: చలికాలంలో క్షీణించే రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధం

Amla Benefits: చలికాలంలో క్షీణించే రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధం
Caption: 
Amla Benefits ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Amla Benefits: చలికాలంలో క్షీణించే రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధం
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Sunday, October 30, 2022 - 22:57
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
41
Is Breaking News: 
No