జూన్ 1 నుంచి స్కూళ్లు పునఃప్రారంభం

తెలంగాణలో రేపటి నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి.

Last Updated : May 31, 2018, 01:26 PM IST
జూన్ 1 నుంచి స్కూళ్లు పునఃప్రారంభం

తెలంగాణలో రేపటి నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా సెలవులను పెంచాలన్న ప్రతిపాదనను తిరస్కరించిన తెలంగాణ విద్యాశాఖ జూన్ మొదటి వారం(జూన్ 4-జూన్ 8) వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సర్క్యూలర్ ను జారీ చేసిన ప్రభుత్వం..సెలవులు ఇచ్చారని జరుగుతున్న ప్రచారం ఆవాస్తవమని తెలిపింది. స్కూళ్లు ప్రారంభమైన తర్వాత ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు టీచర్లకు బడిబాట కార్యక్రమం ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.

రేపు స్కూల్‌కు వెళ్ళకపోతే రూ.700 ఫైన్ అట!

తెలంగాణ ఆవిర్భావ(జూన్ 2)దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలానే తపనతో కొన్ని స్కూళ్లు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. జూన్ 1 నుంచే పిల్లలు తప్పక హాజరుకావాలని లేకపోతే రూ.700 చొప్పున జరిమానా.. ప్రోగ్రెస్ కార్డులో రెడ్ మార్క్ వేస్తామని బూర్గంపాడు(భధ్రాది)లోని ఓ ప్రైవేట్ స్కూల్.. తల్లితండ్రులకు సమాచారమిచ్చింది. ఇంత ఎండల్లో పిల్లలను ఎలా పంపిస్తామంటూ దీనిపై పేరెంట్స్ మండిపడుతున్నారు.

Trending News