TRS MLAs Deal Issue: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. అధికార దాహంతోనే అంధకారంలో ఉన్న బీజేపీ ప్రజాస్వామ్యంతో పరిహాసం ఆడుతోందన్నారు. ప్రజాస్వామ్యంతో పనిలేకుండా ధన స్వామ్యంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల పర్వానికి తెరతీసిందన్నారు. అయితే, వేరే రాష్ట్రాల్లో సాగినట్టు బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపి నేతలను హెచ్చరించారు.
కోట్లు, కాంట్రాక్టులు, పదవులు ఆశగా చూపెట్టి భారతీయ జనతా పార్టీ చేసే ప్రలోభాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లొంగే రకం కాదని ధీమా వ్యక్తంచేశారు. వేరే రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవమానించ వద్దన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ చేసిన కొనుగోలు కుట్రలను తిప్పికొట్టిన మా ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ద్వారా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తానని అనడతంనే బీజేపి భయం పట్టుకుందని.. ఢిల్లీ పీఠం ఎక్కడ కదులుతుందో అనే భయంతోనే ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లాలని చూశారని అన్నారు.
తెలంగాణలో బీజేపి నేతల తీరును తీవ్రంగా తప్పుపట్టిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఎంతో కష్టపడి, ఎన్నో ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని చూస్తూ చూస్తూ తెర్ల కానివ్వమని.. బీజేపితో కొట్లడయినా కాపాడుకుంటాం అని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చిత పరిస్థితులు కల్పించడానికి కుట్ర పన్నిన బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ( Munugode Bypolls Latest Updates ) గెలవలేకే బీజేపి ఈ కుట్రకు తెరతీసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read : Deal With TRS MLAs: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బ్రోకర్ల మంతనాలు.. ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల డీల్ !
Also Read : TRS MLAs Party change Deal: రోడ్డుపై బైఠాయించి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల, ఇంద్రకరణ్ రెడ్డి నిరసన
Also Read : BJP Deal With TRS MLAs: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంపై ధర్మపురి సెటైర్లే సెటైర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి