Kantara is Most Viewed Film now in Karnataka Says Hombale Films: కన్నడ హీరో రిషబ్ శెట్టి డైరెక్ట్క్షన్లో తానే హీరోగా నటిస్తూ చేసిన సినిమా కాంతార, ఈ సినిమాకు కథ కూడా ఆయనే రాసుకోవడం గమనార్హం. కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని తెలుగు సహా హిందీ భాషల్లో కూడా విడుదల చేశారు. నిజానికి ఈ సినిమాని కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించగా ఒక కర్ణాటకలోనే దాదాపు 100 కోట్ల రూపాయల దాకా ఈ సినిమా వసూలు చేసింది.
హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు తాము నిర్మించిన అన్ని సినిమాల్లో ఎక్కువగా ప్రేక్షకులు చూసిన సినిమాగా నిలిచిందని హోంబలే సంస్థ అధికారికంగా ప్రకటించింది. నిజానికి కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు ఈ నిర్మాణ సంస్థకి బాగా డబ్బులు తీసుకువచ్చాయి కానీ ఈ సినిమాతో పోల్చుకుంటే కేజిఎఫ్ టికెట్ రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తక్కువ టికెట్ రేట్లతో ఎక్కువ టికెట్లు తెగగా ఈ సినిమా ద్వారా తాము మరో రికార్డు సృష్టించినట్లు అయిందని ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇక ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ తెలుగులో కూడా వస్తున్నాయి. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. అచ్యుత్ కుమార్, కిషోర్, ప్రమోద్ శెట్టి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలో భూత కోల అనే ఒక ప్రాచీన మంగళూరు ప్రాంతానికి చెందిన ఒక సంప్రదాయ నృత్యాన్ని చేసి చూపించడంతో ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన అత్యద్భుతంగా ఉందని కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇక ఈ సినిమాలో ఈ పాత్ర చేయకపోతే తనకు మరో అవకాశం దక్కదేమో అనే విధంగా ఆయన నటించి ప్రేక్షకులందరినీ మై మరచిపోయేలా చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అరవింద్ రిషబ్ శెట్టితో ఒక సినిమా చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook