Anushka Sharma - Virat Kohli : అన్ని పరిస్థితుల్లోనూ ప్రేమిస్తుంటా.. అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్

ICC T20 Ind Vs Pak Match ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. అనుష్క శర్మ తన భర్త విరాట్ కొహ్లీ ఆటను చూసి మురిసిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2022, 08:52 AM IST
  • పాకిస్థాన్‌పై ఇండియా ఘన విజయం
  • చెలరేగిన కింగ్ విరాట్ కొహ్లీ
  • ఆనందంలో గంతులేసిన అనుష్క శర్మ
Anushka Sharma - Virat Kohli : అన్ని పరిస్థితుల్లోనూ ప్రేమిస్తుంటా.. అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్

 Anushka Sharma - Virat Kohli : టీ20 ప్రపంచకప్‌ 2022లో ఆదివారం నాడు అద్భుతం జరిగింది. పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్ కోహ్లీ (82; 53 బంతుల్లో 6X4, 4X6) దేశ ప్రజలకు ఒక రోజు ముందుగానే దీపావళిని తీసుకొచ్చాడు. దేశమంతా దివాళి సెలెబ్రేషన్స్ ఆదివారం జరిగినట్టుగా అనిపించింది. విరాట్ కోహ్లీ అత్యద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరినీ ఆశ్చర్యపరించాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఫాం కోల్పోయాడని, ఆడటం లేదని ఇన్ని రోజులు విరాట్ కోహ్లీని వేలెత్తి చూపించిన వారంతా ఇప్పుడు నోరెళ్లబెట్టి ఆశ్చర్యంలో మునిగిపోయారు. విరాట్ కోహ్లీ ఎప్పుడైనా ఎక్కడైనా కింగే అని దేశమంతా కీర్తిస్తోంది.

తన భర్త ఆట తీరుని దేశమంతా కీర్తిస్తుండగా.. అనుష్క శర్మ మురిసిపోయినట్టుంది. మ్యాచ్ అయిన అనంతరం అనుష్క శర్మ వేసిన పోస్ట్.. విరాట్ కోహ్లీ గురించి చెప్పిన తీరు అందరినీ కట్టిపడేస్తోంది. విరాట్ మీద అంతులేని ప్రేమను కురిపించింది. 'యూ బ్యూటీ.. యూ ఫ్రీకింగ్ బ్యూటీ.. ఈ రాత్రి నువ్ అందరిలోనూ ఆనందాన్ని నింపావ్.. దివాళిని ముందే తీసుకొచ్చావ్.. నువ్వో అద్భుతమైన శక్తివి.. వ్యక్తివి.. నీ శక్తి, నిబద్దత ఏంటో నాకు తెలుసు.. నా జీవితంలోనే చూసిన మ్యాచుల్లో ఇదే ది బెస్ట్ అని అనుకుంటున్నా.. 

 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

నేను ఇప్పుడు ఇలా ఎందుకు అరుస్తున్నానో.. ఎందుకు గంతులు వేస్తున్నానో మన పాపకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒక రోజు తెలుసుకుంటుంది. ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదుర్కొంటూ ఉన్న దశలో తన తండ్రి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. తన మీద వచ్చిన విమర్శలను తిప్పి కొట్టాడు.. విజృంభించాడు అని ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుంటుంది.. 

నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది.. నీ సత్తాకు హద్దుల్లేవ్.. నీపై నా ప్రేమకు హద్దుల్లేవ్.. లాభనష్టాలు, సుఖదుఃఖాల్లో నీ వెంటే ఉంటాను.. నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ ఇలా తన భర్త గురించి చెబుతూ అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్ వేసింది.
 

Also Read : Actress Pragathi : నేను అందగత్తెని.. నాకు ఆఫర్లు వస్తాయ్.. నటి ప్రగతి బోల్డ్ కామెంట్స్

Also Read : Actress Poorna Marriage : పూర్ణ పెళ్లి ఎప్పుడో అయిపోయిందంట.. అసలు విషయం చెప్పేసిన నటి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News