Kantara Movie Budget And Collections : కన్నడ ఇండస్ట్రీ అప్పుడప్పుడు మ్యాజిక్ చేసేస్తుంటుంది. ఒకప్పుడు కన్నడ సినిమాలను దేశం అంతగా పట్టించుకునేది కాదు. కానీ ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ కేజీయఫ్ అంటూ వచ్చాడో.. అప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది. కన్నడ మేకర్లపై దేశం దృష్టి పడింది. అలా మొత్తానికి శాండిల్ వుడ్ సినిమాలు వస్తున్నాయంటే అందరూ అటుగా చూస్తున్నారు. ఇప్పుడు మరోసారి కన్నడ ఇండస్ట్రీ నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. కాంతారా సినిమాను చూసి ప్రతీ ఒక్కరూ పూనకంతో ఊగిపోతోన్నారు.
కన్నడ స్టార్ హీరో కమ్ దర్శకుడు రిషభ్ శెట్టి తీసిన కాంతారా కన్నడలో ప్రభంజనం సృష్టించింది. కన్నడలో ఈ మూవీ అన్ని రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. అయితే ఈ కాంతారా చిత్రాన్ని చూస్తే ఏ వందల కోట్ల బడ్జెట్ పెట్టారో అని అనిపిస్తుంది. కెమెరా పనితనం, ఆ ఆర్ట్, తీసుకున్న బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా సినిమా స్థాయి పెంచేసింది. రెండు మూడొందల కోట్లు పెట్టారా? అనే అనుమానం కలుగుతుంది. కానీ ఈ చిత్రానికి ఇంచు మించు 15 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది.
అయితే ఈ చిత్రం ఇప్పటికే కేవలం కన్నడలోనే వంద కోట్లకు పైగా కొల్లగొట్టేసింది. అలా రెండు వారాల్లోనే వంద కోట్ల క్లబ్బులో చేరి కేజీయఫ్ రికార్డులను బద్దలు కొట్టేసింది. అయితే కేజీయఫ్ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేశారు. మొదటి పార్ట్‌కే పాన్ ఇండియా రేంజులో విడుదల చేశారు. కానీ కాంతారా మాత్రం కేవలం కన్నడలోనే రిలీజ్ చేశారు. అయినా రికార్డ్ కలెక్షన్లను సాధించేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు ఐదారు రెట్ల లాభాన్ని తీసుకొచ్చింది కాంతారా.
కానీ ఇప్పుడు తమిళం, తెలుగు, హిందీ ఇలా అన్ని భాషల్లోకి డబ్ అయింది. అన్ని చోట్లా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక కలెక్షన్లు ఊపందుకుంటాయి. ఇంకో వంద కోట్లు కాంతారా ఖాతాలో పడేట్టు కనిపిస్తోంది. మొత్తానికి రిషభ్ శెట్టికి వచ్చే ఏడాది అన్ని అవార్డులు రావాల్సిందే అని అంటున్నారు. క్లైమాక్స్‌లో రిషభ్ శెట్టి శివతాండవం ఆడేశాడు. నట విశ్వరూపాన్ని చూపించేశాడు.
Also Read : Bigg Boss Keerthy : అయ్యో ఉన్న 'కీర్తి' కూడా పాయే
Also Read : Katragadda Murari Death : టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook