Allu Arjun Wins CNN-News18 Indian of the Year: పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుకుమార్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ ముత్తంశెట్టి మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా కేవలం తెలుగు, తమిళ, కన్నడ భాషలోనే కాక హిందీలో కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 365 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. ఇక ఈ పుష్ప సినిమా దెబ్బతో అల్లు అర్జున్ కి ఇప్పటికే పలు అవార్డులు వరించాయి. తాజాగా 20 ఏళ్ల నటజీవితం తర్వాత అల్లు అర్జున్ ఒక అరుదైన ఘనత అందుకున్నారు. 20 ఏళ్ల తర్వాత సిఎన్ఎన్ నెట్వర్క్ 18 ప్రతి ఏడాది ప్రకటించే విధంగా ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అల్లు అర్జున్ దక్కించుకున్నారు.
తాజాగా కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీ చేతుల మీదుగా అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డును స్వీకరిస్తూ అల్లు అర్జున్ భారతీయ సినిమా, భారతదేశం ఎన్నటికీ తలవంచదు అంటూ తన పుష్ప డైలాగ్ ను కాస్త మార్చి చెప్పారు. ఇక బన్నీ మాట్లాడుతూ “నేను సినీ పరిశ్రమలో 20 ఏళ్లుగా ఉన్నాను, దక్షిణాదిలో ఎన్నో అవార్డులు అందుకున్నా ఉత్తరాది నుంచి అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి కాబట్టి ఇది నాకు చాలా ప్రత్యేకమని అన్నారు.
ఇక అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ తో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. పుష్ప సూపర్ హిట్ కావడం తర్వాత కేజిఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు నార్త్ ఇండియాలో కూడా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇప్పటికీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు కానీ ప్రీ ప్రొడక్షన్ దశలో సినిమా యూనిట్ బిజీగా ఉన్నట్లుగా టాకింగ్ వినిపిస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Also Read: Vijay Antony Divorce : విడాకులు తీసుకోనున్న విజయ్ ఆంటోనీ.. గొడవలుంటే ఇళ్లు వదిలేసి వెళ్లండన్న హీరో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook