Indian Airforce Day 2022: ప్రతిదానికి ఒక దినోత్సవం ఉన్నట్టు ఎయిర్ ఫోర్స్ కి కూడా ఒక దినోత్సవం ఉంది. దీనినే ఎయిర్ ఫోర్స్ డే అంటారు. ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్ 8వ తేదీన జరుపుకుంటారు. దీనిని గత 90 సంవత్సరాలుగా జరుపుకుంటూ వస్తున్నారు. అక్టోబర్ 8న భారత వైమానిక దళం ఏర్పాటుచేసిన కారణంగా ఈ దినోత్సవాన్ని ప్రతి ఏడాది జరుపుకుంటూ వస్తున్నారు. యుద్ధాల సమయాల్లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా వరద ఉధృతంగా ఉన్న ప్రాంతాల్లో కూడా మనుషులను రక్షించేందుకు ఎయిర్ ఫోర్స్ తన వంతు సహాయం చేస్తుంది. ఈ వైమానిక దినోత్సవం వైమానిక దళం సభ్యులు కవాతులతో ఎయిర్ షోలను నిర్వహిస్తారు.
ప్రస్తుతం భారత వైమానిక దళం అన్ని ప్రపంచ దేశాల్లోకెల్లా అతి శక్తివంతమైంది. ఇందులో ఉండే ప్రతి సభ్యుడు ఎంతో దేశభక్తిని కలిగి ఉంటాడు. దేశ రక్షణ కోసం వారి జీవితాలను పణంగా పెడతారు. కాబట్టి దేశమంతా ఎయిర్ ఫోర్స్ డే, ఆ దళం చేసే పనుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.
ఎయిర్ ఫోర్స్ డే శుభాకాంక్షలు:
>>భారతదేశం కోసం పోరాడే ప్రతి వీరునికి ఎయిర్ ఫోర్స్ డే శుభాకాంక్షలు.
>>అందరికీ భారత వైమానిక దళ దినోత్సవ శుభాకాంక్షలు.
>>భూమి నుంచి ఆకాశం వరకు దేశాన్ని రక్షించే వారందరికీ ఎయిర్ ఫోర్స్ డే శుభాకాంక్షలు.
>>భారత వైమానిక దళం చేస్తున్న కృషికి సలామ్.. ఎయిర్ ఫోర్స్ డే శుభాకాంక్షలు.
>>భారతదేశాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే శుభాకాంక్షలు.
>>ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రు దేశాలతో పోరాడే భారత సైనిక దళాలకు ఎయిర్ ఫోర్స్ డే శుభాకాంక్షలు.
Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు
Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook