Prabhas performs Ravana dahan at Delhi Ramlila: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యంగా ఢిల్లీలో ఈ సంబరాలు అంబరాన్నింటాయి. ప్రతి ఏటా ఎర్రకోట వద్ద రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. బుధవారం జరిగిన ఈ రావణ దహణ కార్యక్రమంలో సినీ నటుడు ప్రభాస్ సందడి చేశారు. ‘ఆదిపురుష్’ని చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ఈ వేడుకల్లో ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వేడుకల్లో పాల్గొనాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆమె హాజరుకాలేకపోయారు.
ప్రతి సంవత్సరం దసరా నాడు జరిగే రామ్ లీలా రావణ దహణం కార్యక్రమానికి ఒక ప్రముఖుడిని ఆహ్వానిస్తారు. ఈ ఏడాది ఆ గౌరవం డార్లింగ్ ప్రభాస్ కు దక్కింది. దాదాపు రాత్రి 7 గంటల సమయంలో ప్రభాస్ రామబాణాన్ని సంధించారు. అనంతరం రావణ దహణం గావించారు. ప్రభాస్‌పై అభిమానుల క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ పోలీసు సిబ్బందితో పాటు మూడు యూనిట్ల పారామిలిటరీ బలగాలు మరియు 140 బౌన్సర్లు భద్రత మరియు క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం ఈవెంట్‌లో ఉంచారు.
ప్రభాస్-ఓం రౌత్ కాంబోలో రాబోతున్న ఆదిపురుష్ జనవరి 12, 2023న థియేటర్లలో సందడి చేయబోతుంది. టీ-సిరీస్‌కి చెందిన భూషణ్ కుమార్ మరియు క్రిషన్ కుమార్, రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రెట్రోఫిల్స్‌కి చెందిన రాజేష్ నాయర్ నిర్మించిన ఈ మూవీ హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో జానకిగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ టీజర్ పై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ టీజర్‌ను బుధవారం రామ్‌లీలాలో ప్రేక్షకుల కోసం ప్రదర్శించారు.
Also Read: Ravan Effigy Collapsed: రావణ దహనంలో అపశృతి.. మంటలతో జనంపై కూలిన రావణుడి బొమ్మ.. వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి