Shani Margi 2022 Rajyog: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాతగా పిలుస్తారు. శని కటాక్షం ఎవరికి ఉంటుందో ఆ వ్యక్తికి జీవితంలో దేనికీ లోటు ఉండదు. అలాంటి శని స్థానంలో అక్టోబరు 23న కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం మకరరాశిలో తిరోగమనంలో ఉన్న శనిదేవుడు.. అక్టోబరు 23 నుంచి మార్గంలోకి వస్తాడు. శని గమనంలో మార్పు వల్ల ఐదు రాశులలో పంచ మహాపురుష రాజయోగం (Panch Mahapurusha Rajyoga in Astrology) ఏర్పడుతుంది. ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మహాపురుష రాజయోగం కొన్ని రాశులవారికి అపారమైన ధనం, కెరీర్ లో పురోగతిని ఇస్తుంది.
మేషం (Aries): శని మహాపురుష రాజయోగం వల్ల ఈ రాశివారు విశేష ప్రయోజనాలను పొందుతారు. కొత్త ఉద్యోగం వస్తుంది. జాబ్ లో ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారంలో భారీగా లాభాలుంటాయి. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి.
సింహం (Leo): ఈ రాశి వారికి రాశి శని మార్గం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరాశివారు కెరీర్ లో ముందుకు సాగుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వీరి ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈ సమయంలో వీరు ఖర్చులను నియంత్రించుకుంటే మేలు జరుగుతుంది.
తుల (Libra): ఈ రాశి వారికి శని సంచారం వల్ల ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. మీరు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. మీరు పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. బంగారం కొనడం వల్ల మేలు జరుగుతుంది.
ధనుస్సు (Sagittarius): శని సంచారం ధనుస్సు రాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీ కెరీర్ లో పురగోతి, ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. వ్యాపారస్తులు లాభపడతారు. చిక్కుకున్న డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మార్కెటింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు.
మీనం (Pisces): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీన రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం ఎంతో మేలు చేస్తుంది. వారి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు లాభపడతారు. కొత్త పరిచయాలు వ్యాపారాన్ని విస్తరించడానికి సహాయపడతాయి. కారు లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Also Read: Shukra Gochar 2022: తులరాశిలోకి ప్రవేశించనున్న శుక్రుడు... ఈ రాశులవారికి లాభాలు షురూ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook