Nagarjuna: సినీ నటుడు నాగార్జున రాజకీయాల్లో వస్తున్నారా..? ఆయన ఏమన్నారంటే..!

Nagarjuna: రాజకీయాలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Written by - Alla Swamy | Last Updated : Sep 30, 2022, 05:07 PM IST
  • రాజకీయాల్లో నాగార్జున?
  • పోటీ చేస్తున్నారని ప్రచారం
  • స్పందించిన కింగ్
Nagarjuna: సినీ నటుడు నాగార్జున రాజకీయాల్లో వస్తున్నారా..? ఆయన ఏమన్నారంటే..!

Nagarjuna: రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారంపై అగ్ర నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. పొలిటికల్ ఎంట్రీ అంటూ వస్తున్న వార్తలను అవాస్తమన్నారు. విజయవాడ ఎంపీగా తాను పోటీ చేయడం లేదన్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి ప్రచారం జరుగుతోందని..ఇందులో కొత్తమేమి లేదని తెలిపారు. తాను రాజకీయాలను దూరంగా ఉన్నానని మరోమారు స్పష్టం చేశారు. 

తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పారు. మంచి కథ వస్తే పొలిటికల్ లీడర్‌గా నటిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు. హిట్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఆయన హీరోగా ది ఘోస్ట్ సినిమా వస్తోంది. ఈ మూవీకి ప్రవీణ్‌ సత్తార్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా హైదరాబాద్‌లో కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా అక్కినేని నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇటీవల సినీ ప్రముఖులు రాజకీయాల్లో వస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, నితిన్ వంటి హీరోలు ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్, నితిన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ తరపున ప్రచారం చేసేందుకు వీరిద్దరూ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.

తాజాగా అగ్ర నటుడు అక్కినేని నాగార్జున పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన వైసీపీ తరపున విజయవాడ నుంచి పోటీ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఆ స్థానం నుంచి సినీ రంగానికి చెందిన పీవీఆర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కేశినాని ఘన విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో పీవీఆర్ స్థానంలో అక్కినేని నాగార్జున పోటీ చేయబోతున్నారని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు.

Also read:Congress President Poll: ఏఐసీసీ చీఫ్‌గా మల్లికార్జున్ ఖర్గే..? కొనసాగుతున్న నామినేషన్ల పర్వం..!

Also read:5G Services: రేపటి నుంచి దేశంలో 5జీ సేవలు..ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News