Big Billion Days Sale: ల్యాప్‌టాప్‌కి బదులుగా బట్టల సబ్బులు.. కస్టమర్‌కి డబ్బులు రిఫండ్ చేశామన్న ఫ్లిప్‌కార్ట్

Ghadi Detergent Soaps Instead of Laptop: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే.. ఘడి బట్టల సబ్బులు డెలివరీ అయ్యాయన్న ఘటనపై ఫ్లిప్‌కార్ట్ స్పందించింది. పొరపాటు చేసిన వారిపై చర్యలకు పూనుకున్నట్టు చెప్పిన ఫ్లిప్‌కార్ట్.. నష్టపోయిన కస్టమర్‌కి డబ్బులు తిరిగి రిఫండ్ చేసినట్టు వెల్లడించింది.

Written by - Pavan | Last Updated : Sep 28, 2022, 07:55 PM IST
  • బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేసిన కస్టమర్
  • ల్యాప్‌టాప్ బదులు ఘడి బట్టల సబ్బులు డెలివరీ అయ్యాయన్న కస్టమర్
  • కస్టమర్‌కి డబ్బులు తిరిగి రిఫండ్ చేసినట్టు స్పష్టంచేసిన ఫ్లిప్‌కార్ట్
Big Billion Days Sale: ల్యాప్‌టాప్‌కి బదులుగా బట్టల సబ్బులు.. కస్టమర్‌కి డబ్బులు రిఫండ్ చేశామన్న ఫ్లిప్‌కార్ట్

Ghadi Detergent Soaps Instead of Laptop: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే.. ఘడి బట్టల సబ్బులు డెలివరీ అయ్యాయన్న ఘటనపై ఫ్లిప్‌కార్ట్ స్పందించింది. పొరపాటు చేసిన వారిపై చర్యలకు పూనుకున్నట్టు చెప్పిన ఫ్లిప్‌కార్ట్.. నష్టపోయిన కస్టమర్‌కి డబ్బులు తిరిగి రిఫండ్ చేసినట్టు వెల్లడించింది. కస్టమర్ నష్టపోకుండా చూడటమే తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్.. 3-4 పని దినాల్లో కస్టమర్‌కి డబ్బులు రిఫండ్ అవుతాయని స్పష్టంచేసింది.

అంతకంటే ముందు ఏం జరిగిందంటే..

బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా తన తండ్రి కోసం ఆన్‌లైన్లో ల్యాప్‌టాప్ ఆర్డర్ ఇచ్చానని... ఆర్డర్ డెలివరి సమయంలో ఓపెన్ బాక్సు కాన్సెప్ట్ తెలియకపోవడంతో తన తండ్రి ఆ డెలివరి బాయ్ ఇచ్చిన బాక్సు తీసుకుని అతడికి ఓటీపీ చెప్పి పంపించేశాడని... తీరా ల్యాప్‌టాప్ బాక్సు ఓపెన్ చేసి చూస్తే.. అందులో ల్యాప్‌టాప్‌కి బదులుగా ఘడి బట్టల సబ్బులు ఉన్నాయని యశస్వి శర్మ అనే ఐఐఎం స్టూడెంట్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. డెలివరి బాయ్ వచ్చి, వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయని... అతడి ముందు ల్యాప్‌టాప్ బాక్సు ఓపెన్ చేయలేదు. ఆ విషయాన్ని సీసీటీవీ దృశ్యాలతో సహా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ.. వాళ్లు కూడా నాదే తప్పని నాపై నింద వేయడం విస్మయానికి గురిచేస్తోందని యశస్వి శర్మ చెప్పుకొచ్చాడు. తాను ఫ్లిప్‌కార్డ్ చేతిలో మోసపోయాననే కోణంలో యశశ్వి శర్మ తన లింక్‌డ్‌ఇన్ పోస్టులో పేర్కొన్నాడు.

యశస్వి శర్మ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఫ్లిప్‌కార్ట్ ఈ ఘటనపై స్పందిస్తూ వివరణ ఇచ్చింది. ఈ ఘటనపై ఇప్పటికే సేల్స్ టీమ్ వెరిఫికేషన్ చేపట్టి ఒక నిర్ధారణకు వచ్చిందని.. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశించినట్టు ఫ్లిప్‌కార్ట్ స్పష్టంచేసింది. కస్టమర్ యశస్వి శర్మకు సైతం డబ్బులు రిఫండ్ చేశామని.. 3-4 పని దినాల్లో ఆ మొత్తం అతడి ఖాతాలో జమ అవుతుందని ఫ్లిప్‌కార్ట్ మేనేజ్‌మెంట్ వివరించింది. కస్టమర్ శాటిస్‌ఫాక్షన్ కోసం ఎన్నో చర్యలు చేపడుతున్నామని.. అందులో భాగంగానే ఈ ఓపెన్ బాక్సు డెలివరీ ఆప్షన్ కూడా ప్రవేశపెట్టామని ఫ్లిప్‌కార్ట్ సెలవిచ్చింది. 

Also Read : Received Potatoes on Meesho: ఆన్‌లైన్‌లో డ్రోన్ కెమెరా కోసం ఆర్డర్ చేస్తే ఏమొచ్చాయో చూడండి

Also Read : Cobra Snake in School Bag: స్కూల్ బ్యాగులో భయంకరమైన నాగు పాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News