Post Office Schemes: వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్ సెక్యూర్ చేసుకోవాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ ఏ పథకం మంచిది, ఏది కాదు, ఏది సురక్షితమనే వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..
పోస్ట్ ఆఫీసులో అందుబాటులో ఉన్న వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా పోస్టాఫీసు పధకాలంటే ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవని అర్ధం. అంటే పూర్తిగా సురక్షితం. మీరు పోస్ట్ ఆఫీసులో ఎక్కౌంట్ ఓపెన్ చేసుకునుంటే..లేదా ఏదైనా స్కీమ్ కోసం ఆలోచిస్తుంటే పోస్టాఫీసులో అద్భుతమైన పథకాలున్నాయి. ఇందులో ఏకంగా 35 లక్షలు లాభాల్ని ఆర్జించవచ్చు. ఆశ్యర్చపోవద్దు..నిజమే..
నెలకు 15 వందలతో 35 లక్షల రూపాయలు
పోస్టాఫీసులో పెట్టుబడులు పెట్టేందుకు మంచి ఆప్షన్ ఇది. ఇందులో మీ డబ్బుకు పూర్తిగా గ్యారంటీ ఉంటుంది. పోస్టాఫీసు గ్రామ్ సురక్షా యోజన పథకమిది. ఇందులో భారీ లాభాలున్నాయి. పోస్టాఫీసు గ్రామ్ సురక్షా యోజన అనేది ఓ రకమైన భీమా పధకం. ఇందులో మీరు నెలకు కేవలం 15 వందల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఫలితంగా మీకు 35 లక్షల రూపాయలు లభిస్తాయి.
ఈ పథకానికి అర్హులెవరు
19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకూ ఎవరైనా సరే ఈ స్కీమ్ ప్రారంభించవచ్చు. ఈ పధకంలో కనీస భీమా మొత్తం 10 వేల రూపాయలు. అది కాకుండా అత్యధికంగా 10 లక్షల రూపాయలుంది. ఈ పధకంలో ప్రీమియం మొత్తాన్ని నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లింపు కోసం 30 రోజుల వ్యవధి కూడా ఉంటుంది. ఈ పథకంలో మీకు రుణ సౌకర్యం కూడా ఉంటుంది. ఇది కాకుండా లోన్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. పాలసీ తీసుకున్న 4 ఏళ్ల తరువాతే లోన్ తీసుకునే సౌకర్యం పొందవచ్చు.
ఒకవేళ 19 ఏళ్ల నుంచి పెట్టుబడి పెట్టి పది లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే..55 ఏళ్ల కోసం నెలవారీ ప్రీమియం 1515 రూపాయలు కాగా 58 ఏళ్లకైతే 1463 రూపాయలు, 60 ఏళ్లకైతే 1411 రూపాయలుంటుంది.
55 ఏళ్ల కోసమైతే 31.60 లక్షల రూపాయలు మెచ్యూరిటీ బెనిఫిట్ లభిస్తుంది. 58 ఏళ్లకైతే 33.40 లక్షల రూపాయలు మెచ్యూరిటీ వస్తుంది. అదే 60 ఏళ్లకైతే 34.60 లక్షల రూపాయలు మెచ్యూరిటీ ఫండ్ లభిస్తుంది. ఈ స్కీమ్ ప్రత్యేకత ఏంటంటే ఈ పాలసీని మధ్యలో సరెండర్ కూడా చేయవచ్చు. అయితే కనీసం మూడేళ్ల తరువాతే సరెండర్ చేసే అవకాశం ఉంటుంది.
Also read: PF Transfer: ఉద్యోగం మారినా అదే పీఎఫ్ ఎక్కౌంట్, పాత పీఎఫ్ ఎక్కౌంట్ ఎలా మార్చాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Post Office Schemes: నూటికి నూరు శాతం సురక్షితం, నెలకు 15 వందలతో 35 లక్షల సంపాదన