Sperm Count: ఆధునిక జీవనశైలిలో ఎదుర్కొంటున్న ఎన్నో రకాల సమస్యల్లో ఒకటి సంతాన సాఫల్యత. ముఖ్యంగా పురుషుల స్పెర్మ్ కౌంట్ సమస్య. కొన్ని రకాల ఆహార పదార్ధాల ద్వారా స్పెర్మ్ కౌంట్ పెంచవచ్చంటున్నారు వైద్యులు.
వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా చాలామందిలో స్పెర్మ్ కౌంట్ సమస్య ప్రధానంగా కన్పిస్తోంది. అసలీ సమస్య ఎందుకొస్తుంది, ఏ అలవాట్లు కారణమౌతున్నాయనేది తెలుసుకోవాలి. ఏ పదార్ధాలు తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చనేది పరిశీలించాలి. ఆ వివరాలు మీ కోసం.
స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి కారణాలు
ధూమపానం సేవనం ప్రధాన కారణం. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం కూడా ఓ కారణం. శరీరంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం, టైట్ అండర్ వేర్స్ ధరించడం కూడా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండేందుకు కారణాలు. మద్యపాన సేవనం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.
స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు ఏం తినాలి
1. పురుషులు తమ డైట్లో గుడ్డును భాగంగా చేసుకోవాలి. గుడ్డులో ఉండే విటమిన్ ఇ, జింక్, ప్రోటీన్లు స్పెర్మ్ కౌంట్ పెంచుతాయి.
2. రోజూ ఒక యాపిల్ తింటే స్పెర్మ్ కౌంట్ కచ్చితంగా పెరుగుతుంది. యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫెర్టిలిటీకు ఉపయోగపడతాయి.
3. టొమాటో కూడా మగవారి ఆరోగ్యానికి మంచిది. టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. టొమాటోను ఏ రూపంలో తీసుకున్నా ఫరవాలేదు.
4. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది ఫెర్టిలిటీ పెంచేందుకు దోహదపడుతుంది
Also read: Dark Neck: మెడభాగం నల్లగా మారిపోయిందా..ఫిట్కరీ పౌడర్‌తో సులభంగా నిర్మూలన ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok