Green Grapes Smoothie For High Cholesterol: ద్రాక్ష శరీరానికి చాలా రకాలు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని యాక్టివ్‌గా చేయడానికి ప్రభావవంతంగా సహాయపడుతాయి. అయితే అన్ని పండ్లలోకెల్లా ఈ పండ్లలో బాడీకి అవసరమనైన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. రోజూ ఈ తెల్ల ద్రాక్షలను జ్యూస్ చేసుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్ సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించే ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. అయితే ఈ జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీర సమస్యలన్నీ దూరమవుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ సిలు శరీర అభివృద్ధికి సహాయపడతాయి. ఈ డ్రింక్‌ను పిల్లలకు ఇవ్వడం వల్ల వారికి పోషకాహార సమస్యలు దూరమవుతాయి. అయితే ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
ఈ పండ్లు ఆరోగ్య పరంగా శరీరానికి చాలా అవసరం. అయితే ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ జ్యూస్‌లను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఇందులో ఫైబర్ పరిమాణలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచేందుకు సహాయపడుతాయి. అయితే ఈ గ్రేప్స్ జ్యూస్‌ను పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. కాబట్టి ఈ జ్యూస్‌ను క్రమం తప్పకుండా పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లల్లో దీర్ఘకాలిక సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఈ గ్రేప్స్ జ్యూస్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందా..
గ్రేప్స్ స్మూతీ చేయడానికి కావాల్సిన పదార్థాలు:
<<గ్రీన్ గ్రేప్స్ – 1 బౌల్
<<చక్కెర – రుచికి కావాల్సినంత.
<<నిమ్మరసం – 1 tsp
<<పుదీనా ఆకులు – 10-12
<<ఐస్ క్యూబ్స్ – 4 నుంచి 5
గ్రేప్ స్మూతీని తయారుచేసే విధానం:
గ్రేప్ స్మూతీని తయారు చేయడానికి.. ముందుగా ద్రాక్షను రెండుసార్లు శుభ్రమైన నీటితో కడగాలి.. ఆపై వాటిని ఒక మిక్సి గిన్నెలోకి తీసుకోవాలి. దీని తరువాత..పుదీనా ఆకులు, పంచదార, సగం నిమ్మకాయను ఒక జాడీలో తీసుకొని వాటిని ఫైన్‌గా గ్రైడ్ చేయాలి. ఇలా చేసిన ఆ జ్యూస్ పై పుదీనా ఆకులు, ఐస్ క్యూబ్స్ వేసి.. తాగొచ్చు. ఇలా చేసుకుని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా శరీరంలో సంవత్సరాలుగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok