Google Play Store: గూగుల్ ఇప్పుడు మర కొత్త ఫీచర్ రోల్ అవుట్ చేస్తోంది. మీ డివైస్‌ను సమీక్షించి రేటింగ్ ఇస్తుంది. ఆ కొత్త ఫీచర్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆండ్రాయిడ్ యాప్స్ అనేవి స్మార్ట్‌ఫోన్లకే పరిమితం కావు. అదే సమయంలో ఒకరి అనుభవం మరొకరికి రాకపోవచ్చు. ఆండ్రాయిడ్ యాప్ వినియోగంలో ఏ ఇద్దరి అనుభవం కూడా ఒకటే ఉండదు. యూట్యూబ్, ఇతర స్మార్ట్‌ఫోన్లు వినియోగించేవారి ఎక్స్‌పీరియన్స్ ఒకేలా ఉండదు. గూగుల్ ఇప్పుడు సరికొత్తగా ప్లే స్టోర్‌లో ఓ ఫీచర్ ప్రవేశపెడుతోంది. యూజర్ల ఉపయోగం ఆధారంగా సమీక్షించి రేటింగ్ ఇస్తుంది.
గూగుల్ తొలిసారిగా ఆగస్టు 2021లో ఈ ఫీచర్ గురించి ప్రకటించింది. 2021 నవంబర్ నుంచి ఫోన్‌పై ఆండ్రాయిడ్ యూజర్లు తమ దేశం ఆధారంగా ప్రత్యేక రేటింగ్ చూడవచ్చని అప్పట్లో వెల్లడించింది. 2022 ప్రారంభంలో ట్యాబ్‌లెట్, క్రోమ్‌బుక్ వంటి ఇతర కారణాలతో డివైస్ రేటింగ్ ఇస్తామని అప్పట్లో తెలిపింది.
ఎట్టకేలకు ఇప్పుడా ఫీచర్ రోల్ అవుట్ అవుతోంది. అంటే యూజర్లు ఇప్పుడు యాప్ సమీక్ష రేటింగ్ చూడగలరు. ఈ సమీక్ష, రేటింగ్ అనేది యూజర్లు డివైస్‌ను ఎలా వినియోగిస్తున్నారనే విషయంపై ఆధారపడి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook