Jio Rs 583 Prepaid Plan: జియో వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌.. అదిరిపోయో ప్లాన్స్‌తో పాటు Disney+ Hotstar..!

Jio Rs 583 Prepaid Plan: ప్రస్తుతం చాలా మంది జియో అందిచిన టెలీ కమ్యూనికేషన్ సేవలను వినియోగిస్తున్నారు.  తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్లాన్‌లకు జియో ఎంతో ప్రసిద్ధి కలదు. అయితే ప్రస్తుతం జియో మిడ్ టర్మ్ ప్లాన్‌లు ఎంతో బాగా ప్రాచుర్యం పొందాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2022, 12:37 PM IST
  • 600 రూపాయలలోపు జియో ప్లాన్
  • డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితం
  • మరిన్ని వివరాలకు కోసం ఈ వ్యాసం
Jio Rs 583 Prepaid Plan: జియో వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌.. అదిరిపోయో ప్లాన్స్‌తో పాటు Disney+ Hotstar..!

Jio Rs 583 Prepaid Plan: ప్రస్తుతం చాలా మంది జియో అందిచిన టెలీ కమ్యూనికేషన్ సేవలను వినియోగిస్తున్నారు.  తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్లాన్‌లకు జియో ఎంతో ప్రసిద్ధి కలదు. అయితే ప్రస్తుతం జియో మిడ్ టర్మ్ ప్లాన్‌లు ఎంతో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇటీవలే మార్కెట్‌లోకి జియో ప్రవేశపెట్టిన ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్ OTT ప్రయోజనాలతో వచ్చింది. దీంతో వినియోగదారులు మరిన్ని సేలవలు పొందనున్నారు. ఈ క్రమంలో జియో యూజర్స్‌కు 84జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌ చాలా పాతదైనప్పటికీ.. ఇది ఇప్పటికీ చాలా ప్రజాదరణ పొందింది. ఈ ప్లాన్ చాలా నెలలుగా జియో ప్రీపెయిడ్ సర్వీస్ పోర్ట్‌ఫోలియోలో ఉంది.  అయితే రూ.583 చెల్లించి ఈ సేవలను వినియోగించవచ్చు. ఈ ప్లాన్‌లో ఉండే ఇతర ప్రయోజనాలును మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Reliance Jio Rs 583 Prepaid Plan:
జియో రూ. 583 ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్.. రోజుకు 100 సందేశాల ప్రయోజనాలతో వస్తుంది. దీనితో పాటు.. వినియోగదారులు ప్రతిరోజూ 1.5GB FUP (ఫెయిర్-యూజ్-పాలసీ) డేటాను కూడా పొందుతారు. అయితే ఈ సేవల్లో వినియోగదారులు మొత్తం 84GB డేటాను పొందుతారు. 90 రోజుల పాటు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రూ. 149 డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదనపు ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వీటితో పాటు జియో సినిమా(JioCinema), జియో సెక్యూరిటీ(JioSecurity), జియో క్లౌడ్‌( JioCloud) వంటి  అప్లికేషన్‌లకు యాక్సెస్‌ లభిస్తోంది.

Reliance Jio 583 Prepaid Plan Benefits:
మూడు నెలల పాటు అదనపు డబ్బులు చెల్లించకుండానే.. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందాలనుకునే జియో వినియోగదారులు ఈ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో అందించిన రోజువారీ డేటా వినియోగదారులకు సరిపోతుంది. అయితే  హై-స్పీడ్ డేటా అయిపోయితే.. జియో అందించిన 4G డేటా వోచర్‌లతో కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కేవలం రూ. 15కే లభించనుంది. మరిన్ని విషయాల కోసం జియో యాప్‌ను సందర్శించవచ్చు.

Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!

Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News