Telangana Rain Updates: తెలంగాణకు ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వాతావరణ శాఖ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఇవాళ తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలో రేపు (సెప్టెంబర్ 10) కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం (సెప్టెంబర్ 11) చాలాచోట్ల ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన :
హైదరాబాద్‌లో గురువారం రాత్రి కుండపోత వాన కురిసింది. అత్యధికంగా ఏఎస్ రావు నగర్లో 8.0 సెం.మీ వర్షపాతం, నేరెడ్మెట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, కుషాయిగూడ, కుత్బుల్లాపూర్, మచ్చబొల్లారం ప్రాంతాల్లో 8 సెం.మీ వర్షపాతం, కాప్రాలో 7.5 సెం.మీ, మల్కాజ్‌గిరిలో 6.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా మోటకొండూరులో 6.8 సెం.మీ, నిర్మల్ జిల్లా పెంబిలో 6.4 సెం.మీ వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు జలాశయాల గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 8, 2022
Also Read: Kalyani Priyadarshan Pics: శారీలో సెగలు రేపుతున్న కళ్యాణి ప్రియదర్శన్.. కుర్రాళ్ల ఫ్యూజులు ఔట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook