Pakistan becomes 2nd Team to biggest victory in T20Is: పాకిస్తాన్ క్రికెట్ జట్టు అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన రెండో జట్టుగా రికార్డుల్లో నిలిచింది. ఆసియా కప్ 2022లో భాగంగా శుక్రవారం హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 155 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంతో ఈ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలోనే భారత్ పేరుపై ఉన్న రికార్డును పాకిస్తాన్ బద్దలు కొట్టింది.
2018లో ఐర్లాండ్‌పై 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా రెండో స్ధానంలో ఉండేది. హాంగ్ కాంగ్ మ్యాచ్‌తో భారత్ రికార్డును పాకిస్తాన్ బ్రేక్ చేసింది. ఈ జాబితాలో శ్రీలంక మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2007లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో లంక ఏకంగా 172 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అప్పటినుంచి ఈ రికార్డు ఏ జట్టుకు సాధ్యం కాలేదు.
హాంగ్ కాంగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 రన్స్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ (78 పరుగులు నాటౌట్), ఫఖర్ జమాన్ (53), కుష్‌దిల్ షా (35) రాణించారు. అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్ కాంగ్ 38 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రిజ్వాన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.
ఈ విజయంతో పాకిస్తాన్ సూపర్ 4కు అర్హత సాధించింది. గ్రూప్-ఏలో ఉన్న భారత్ రెండు విజయాలతో ఇదివరకే సూపర్ 4కు చేరుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు గ్రూప్-బి నుంచి ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు సూపర్ 4కు అర్హత సాధించాయి. ఇక సూపర్ 4లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ ఆదివారం మరోసారి తలపడనున్నాయి.
Also Read: Viral Video: అబ్బాయే కానీ.. అమ్మాయిలా డాన్స్ అదరగొట్టాడు పో! ఫిదా అవుతున్న నెటిజన్లు
Also Read: సూపర్ 4కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook