Ganesh Chaturthi 2022 Date: రేపు అంటే ఆగస్టు 31న వినాయక చవితి. ఈరోజున ప్రతి ఇంట్లో గణపతి కొలువు దీరుతాడు. ఈ గణపతి యెుక్క ఉత్సవాలు (Vinayaka Chavithi 2022) మెుత్తం 10 రోజులపాటు జరుగుతాయి. అనంత చతుర్థి నాడు విష్నేుశ్వరుడి నిమజ్జనం జరుగుతుంది. గణేష్ చతుర్థి సమయంలో కొన్ని పవిత్రమైన యోగాలు కూడా ఏర్పడతున్నాయి. పది రోజులపాటు జరిగే గణేశుడి ఉత్సవాల సమయంలో సూర్యుడు, బుధుడు, బృహస్పతి మరియు శని వంటి ముఖ్యమైన గ్రహాలు తమ సొంత రాశులలో సంచరించనున్నాయి. 300 సంవత్సరాల తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి.
ఈ వినాయక చవితి ఏదైనా పనిని మెుదలుపెట్టడానికి, షాపింగ్ (Shopping) చేయడానికి శుభప్రదం. గణేశోత్సవం ఆగస్టు 31 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 9 వరకు కొనసాగనుంది. ఈ 10 రోజులలో కొనుగోళ్లు చేయడానికి మరియు కొత్త పనులు ప్రారంభించడానికి చాలా శుభ ముహూర్తాలు ఉన్నాయి. 300 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న ఈ యాదృచ్ఛికం రోజు కొత్త ఇల్లు కొనడం, బుక్ చేసుకోవడం, నగలు, కారు వంటి విలువైన వస్తువులను కొనడం లేదా బుక్ చేసుకోవడం చాలా మంచిదిగా భావిస్తారు. దేశంలో చాలా చోట్ల గణేష్ చతుర్థిని అబుజ ముహూర్తంగా పరిగణిస్తారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే వినాయక కొనుగోళ్లు జోరుందకున్నాయి.
Also Read: Krishna's Dwaraka Real or Fake: కృష్ణుడి ద్వారక నిజంగానే ఉందా లేక ఫేకా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook