Feng Shui Tips : ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే...ఈ ఫెంగ్ షుయ్ చిట్కాలను పాటించండి!

Feng Shui Money Tips : చైనీస్ వాస్తు శాస్త్రం ఫెంగ్ షుయ్‌లో డబ్బుకు సంబంధించి అనేక చిట్కాలు చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 30, 2022, 12:00 PM IST
Feng Shui Tips : ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే...ఈ ఫెంగ్ షుయ్ చిట్కాలను పాటించండి!

Feng Shui Tips For Success: భారతీయ వాస్తు శాస్త్రం వలె చైనాలో కూడా వాస్తు శాస్త్రం ఉంది. చైనీస్ వాస్తుశాస్త్రాన్ని ఫెంగ్ షుయ్ అంటారు. ఫెంగ్ షుయ్‌లో ఇల్లు, ఆఫీసు, తదితర ప్రదేశాలకు సంబంధించిన ఎన్నో వాస్తు చిట్కాలు చెప్పబడ్డాయి. అంతేకాకుండా అదృష్టం, కెరీర్ లో పురోగతి, అపారమైన డబ్బు సంపాదించడానికి గల ఎన్నో టిప్స్ ఫెంగ్ షుయ్లో చెప్పబడ్డాయి. 

డబ్బు సంపాదించడానికి ఫెంగ్ షుయ్ చిట్కాలు...
>> ఫెంగ్ షుయ్ ప్రకారం, డబ్బు ఉన్న ప్రదేశంలో అద్దం ఉంచండి. దీనితో డబ్బు ప్రవాహం వేగంగా పెరుగుతుంది మరియు మీరు త్వరలో ధనవంతులు అవుతారు.
>> మీ వర్కింగ్ టేబుల్ పైన ఒక క్రిస్టల్‌ను వేలాడదీయండి. ఇలా చేయడం ద్వారా అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది మరియు మీరు మంచి మార్గంలో పని చేస్తారు. 
>> మీరు కూర్చుని పనిచేసే స్థలం వెనుక గోడపై గుర్రం నడుస్తున్న ఫోటోను పెట్టండి. అలా చేయడం వల్ల ఉద్యోగ-వ్యాపారంలో విజయం సాధిస్తారు. 
>> ఫెంగ్ షుయ్ ప్రకారం, డబ్బు కొరత ఉంటే, ఇంట్లో వెదురు మొక్కను నాటండి. దీంతో ధన ప్రవాహం పెరుగుతుంది.
>> అదృష్టం కోసం ఇంటి మెయిన్ డోర్ లేదా బాల్కనీలో మెటల్ లేదా చెక్క విండ్ చైమ్‌ను అమర్చండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది మరియు ఉద్యోగ-వ్యాపారాలలో శీఘ్ర విజయం లభిస్తుంది.

Also Read: Krishna's Dwaraka Real or Fake: కృష్ణుడి ద్వారక నిజంగానే ఉందా లేక ఫేకా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News