Covid 19 Cases Updates: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 9436 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 84 కేసులు తక్కువగా నమోదయ్యాయి. గడిచిన రెండు రోజుల్లో వరుసగా 10,256 కేసులు 9520 కేసులు నమోదయ్యాయి. ఇవాళ కొత్త కేసుల సంఖ్య మరింత తగ్గింది. కరోనాతో గడిచిన 24 గంటల్లో మరో 30 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,408,132కి చేరింది. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 527,754కి చేరింది.
ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 86,591గా ఉంది. నిన్న 87,311 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇవాళ ఆ సంఖ్య తగ్గింది. నిన్నటితో పోలిస్తే యాక్టివ్ కేసులు 720 తక్కువగా నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 0.20 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 2.43 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉంది.
గడిచిన 24 గంటల్లో మరో 13,258 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్ రికవరీల సంఖ్య 4,37,70,913కి చేరింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.61 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4,22,322 కోవిడ్ టెస్టులు నిర్వహించగా... ఇప్పటివరకూ నిర్వహించిన కోవిడ్ టెస్టుల సంఖ్య 88.43 కోట్లకి చేరింది.
ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 211.13 కోట్ల వ్యాక్సిన్లు వేశారు. ఇందులో గడిచిన 24 గంటల్లో 31,60,292 వ్యాక్సిన్ డోసులు వేశారు. ఈ ఏడాది జూలైలో కరోనా వ్యాక్సినేషన్లో భారత్ 200 కోట్ల మైలురాయిని చేరిన సంగతి తెలిసిందే. తక్కువ కాలంలోనే ఈ మైలు రాయిని చేరిన రెండో దేశంగా భారత్ నిలిచింది.
Also Read: Viral Video: అమ్మాయి మొబైల్ స్నాచింగ్.. వెంబడించి పట్టేశారు.. కానీ చివరలో అస్సలు ఊహించని ట్విస్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook