Chanakya Niti Lessons: చాణక్యుడు లేదా కౌటిల్యుడు.. భారతీయ శాస్త్రాల్లో మేదావిగా, అర్థశాస్త్రజ్ఞుడిగా, తత్వవేత్తగా ప్రసిద్ధి పొందారు. వ్యక్తిత్వ వికాసానికి, ప్రేరణకు, ఆర్థికపరమైన విజయాలకు.. ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి చాలామంది చాణక్యుడి సూచనలు ఫాలో అవుతారు. చాణక్యుడి సూచనల ప్రకారం.. కొన్నిప్రత్యేక పరిస్థితుల్లో కొందరు వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఆ పరిస్థితులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీకు పరిచయస్తులు లేదా స్నేహం ఉన్న వ్యక్తుల్లో అకస్మాత్తుగా వారి ప్రవర్తన, స్వభావం మారినట్లయితే వెంటనే అప్రమత్తమవ్వాలి. సడెన్‌గా వచ్చే ఆ మార్పుకు ఏదైనా కుట్ర కారణం కావొచ్చు. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తులు ఎప్పుడెలా మారిపోతారో చెప్పడం కష్టం. వారి అవసరం తీరాక మిమ్మల్ని గౌరవించకపోవచ్చు. కాబట్టి వారికి దూరంగా ఉండటమే అన్నివిధాలా శ్రేయస్కరం.
వ్యక్తుల స్వభావంలో మార్పులను కొంతమంది త్వరగా గుర్తించి సీరియస్‌గా తీసుకుంటారు. కొంతమంది పెద్దగా పట్టించుకోరు. ఇంకొందరు అసలు గుర్తించలేరు. ప్రవర్తన మారిన తర్వాత అటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడకపోవచ్చు. అందుకు అనుకూల పరిస్థితి ఉండకపోవచ్చు. ఏదేమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వ్యక్తులకు దగ్గరగా ఉండొద్దని చాణక్య నీతి చెబుతోంది. లేకపోతే అనవసర రిస్క్, వివాదాలు కొని తెచ్చుకునే అవకాశం లేకపోలేదు.
Also Read: రెండో రోజు దారుణంగా కలెక్షన్స్.. కానీ హిందీలో మాత్రం అదుర్స్!
Also Read: JP NADDA MEETING LIVE UPDATES: బీజేపీలోకి క్రికెటర్ మిథాలీ రాజ్! జేపీ నడ్డాతో కీలక సమావేశం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook