Bandi Sanjay Kumar: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా బండి సంజయ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారనేందుకు వీడియోలు, ఎఫ్ఐఆర్లు తదితర ఆధారాలుంటే ఇవాళ సమర్పించాలని పోలీసులను బుధవారం రోజున న్యాయస్థానం ఆదేశించింది.
Bandi Sanjay Kumar: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా బండి సంజయ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారనేందుకు వీడియోలు, ఎఫ్ఐఆర్లు తదితర ఆధారాలుంటే ఇవాళ సమర్పించాలని పోలీసులను బుధవారం రోజున న్యాయస్థానం ఆదేశించింది. బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను ఆపకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ బీజేపీ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్ లలిత కన్నెగంటి నిన్న విచారణ చేపట్టారు.