Ind vs Pak: ఆసియా కప్‌లో ప్రత్యర్ధి దేశాలైన ఇండియా, పాకిస్తాన్లో తొలి మ్యాచ్‌లోనే తలపడనున్నాయి. ఆగస్టు 28న జరగనున్న ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 జట్టు కూర్పు గురించి తెలుసుకుందాం..
ఇండియా, పాకిస్తాన్ ప్రత్యర్ధి దేశాల మధ్య మరోసారి రసవత్తర పోరుకు అంతా సిద్ధమౌతోంది. ఆగస్టు 27న ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆగస్టు 28న జరగనున్న కీలకమైన ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 ఎవరనేది ఆసక్తిగా మారింది.
ఆసియా కప్ 2022లో ఆగస్టు 28వ తేదీన ఇండియా, పాకిస్తాన్ దేశాలు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో పాటు ఆసియా కప్ గెలుపుపై కూడా ఇండియా సిద్దమౌతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్డేడియంలో సాయంత్రం 7.30 నిమిషాలకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆగస్టు 28న జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ జట్లు 9 నెలల తరువాత మళ్లీ తలపడనున్నాయియ. గతంలో అంటే 2021 టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు దేశాలు తలపడగా..పాకిస్తాన్ జట్టు టీమ్ ఇండియాను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఇప్పుడు టీమ్ ఇండియా..పాకిస్తాన్‌పై ప్రతీకారం కోసం చూస్తోంది. వాస్తవానికి టీమ్ ఇండియాలో ఉన్న దిగ్గజ ఆటగాళ్లు పాకిస్తాన్‌ను సునాయసంగా ఓడించగలరు. అలాంటి ప్లేయింగ్ 11తోనే ఇండియా బరిలో దిగనుంది.
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓపెనింగ్‌ను కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ చేయనున్నారు. ఈ ఇద్దరూ బ్యాటింగ్‌లో అగ్రగణ్యులు కావడం విశేషం.ఇక నెంబర్ 3 స్తానంలో విరాట్ కోహ్లీ ఉండనే ఉన్నాడు. అటు 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ దిగే అవకాశాలున్నాయి. టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ నిలబడితే కచ్చితంగా భారీ స్కోర్ కాగలదు. ఇక మిడిల్ ఆర్డర్ లో 5వ స్థానంలో వికెట్ కీపర్ , బ్యాటర్ రిషభ్ పంత్ దిగనున్నాడు. అటు ఇతర ఆల్ రౌండర్లలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలున్నారు. బౌలింగ్ విషయంలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింహ్, ఆవేశ్ ఖాన్లకు చోటు దక్కింది. భువి జట్టులో అనుభవజ్ఞుడైన ఆటగాడు. అర్షదీప్ సింహ్‌కు డెత్ ఓవర్లు వేయడంలో ప్రావీణ్యముంది.
టీమ్ ఇండియా ప్లేయింగ్ 11
రోహిత్ శర్మ
కేఎల్ రాహుల్
విరాట్ కోహ్లి
సూర్య కుమార్ యాదవ్
రిషభ్ పంత్
హార్దిక్ పాండ్యా
రవీంద్ర జడేజా
ఆర్ అశ్విన్
ఆవేశ్ ఖాన్
అర్షదీప్ సింహ్
భువనేశ్వర్ కుమార్
Also read: Team India: ఆసియా కప్ 2022లో టీమ్ ఇండియాకు దూరమైన ఆ ఇద్దరు కీలక ఆటగాళ్లు, కారణమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook