Prabhas, Jr NTR, Allu Arjun stood Top in Most popular male film stars in India For July 2022: తెలుగులో టాప్ హీరోలు ఎవరు? అలాగే తమిళనాడులో టాప్ హీరోలు ఎవరు? కన్నడ, మలయాళ, హిందీ పరిశ్రమల్లో టాప్ హీరోలు ఎవరు? అని ప్రతినెలా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుంటున్న హీరోలవారి లెక్కలు తీసి టాప్ టెన్ హీరోల లిస్టు ప్రకటిస్తున్న ఆర్మాక్స్ మీడియా సంస్థ ఈ నెలకు గాను ప్యాన్ ఇండియా లెవెల్లో టాప్ టెన్ హీరోల లిస్టు విడుదల చేసింది.
జూన్ నెలలో ఎలా అయితే తమిళ స్టార్ హీరో విజయ్ మొదటి స్థానంలో నిలిచారో అదే విధంగా జూలై నెలలో కూడా విజయ్ మొదటి స్థానంలో నిలిచారో తర్వాతి స్థానంలో ప్రభాస్ నిలువగా వీరిద్దరి తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, యష్, మొదటి ఐదు స్థానాలు దక్కించుకున్నారు. తర్వాత ఆరో స్థానంలో రామ్ చరణ్ నిలవగా ఏడవ స్థానంలో అక్షయ్ కుమార్ నిలిచారు. ఇక ఎనిమిదవ స్థానంలో మహేష్ బాబు నిలిచారు. తొమ్మిదో స్థానంలో సూర్య నిలవగా పదవ స్థానంలో అజిత్ కుమార్ నిలిచారు.
ప్రస్తుతం ఈ లిస్ట్ కు సంబంధించిన వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేస్తున్న జాబితాలలో ప్రామాణికత లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం నుంచి అసలు హిట్ సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న విజయ్ కి మొదటి స్థానం ఎలా దక్కింది ? సూపర్ హిట్స్ అందుకున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, యష్ వంటి వారికి తర్వాత స్థానాలు ఎలా దక్కాయి అనే విషయం మీద చర్చ జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ లిస్టులో కేవలం బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ ఒక్కరే స్థానం దక్కించుకోగా తెలుగు నుంచి ఐదుగురు హీరోలు స్థానం దక్కించుకున్నారు. అదేవిధంగా తమిళనాడు నుంచి ముగ్గురు, కన్నడ సినీ పరిశ్రమ నుంచి ఒక్కరు ప్లేస్ దక్కించుకున్నారు.
Also Read: Poonam Bajwa Pics: పింక్ మినీ డ్రెస్‌లో పూనమ్ బజ్వా.. కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇచ్చిన బొద్దుగుమ్మ!
Also Read: Sonam Kapoor Baby Boy: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ కపూర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి