Lakshmi Parvathi reaction on Uma Maheshwari Death: ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమెకు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత ఈరోజు ఉదయం ఆమె అంత్యక్రియలు కూడా జరిగాయి. అయితే ఉమామహేశ్వరి మరణం మీద తాజాగా లక్ష్మీపార్వతి స్పందించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధ కలిగిస్తున్నాయని చెప్పారు.
ఉమామహేశ్వరి మృతికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఆమె అసలు ఏం జరిగిందనేది ఇంకా మిస్టరీగానే ఉందని అన్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలు తెలిసిన వారు ఈ విషయంలో అనుమానించక తప్పదని, ఆ కుటుంబానికి చంద్రబాబు ఒక శనిలా పట్టుకున్నాడని విమర్శించారు. ఒకప్పుడు సింహగర్జనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్ చంద్రబాబు చర్యల వల్ల గుండెపోటుతో మరణించారని ఆయన బ్యాంక్ అకౌంట్లో కూడా సీజ్ చేయించి అధ్యక్ష పదవి కూడా లాక్కున్నారని అన్నారు.
నన్ను బూచిగా చూపించి కుటుంబాన్ని నమ్మించారని తర్వాత హరికృష్ణకు పదవి ఇచ్చి ఆరు నెలల్లోనే లాక్కున్నారని అన్నారు. మానసికంగా హరికృష్ణను ఎన్నో ఇబ్బందులు పెట్టారని అందుకే ఈరోజుకి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో మాట్లాడరని అన్నారు. ఉమామహేశ్వరి మరణం కూడా మిస్టరీగానే ఉందని, సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో నమ్మేవి ఉన్నాయి, కొన్ని నమ్మనివి ఉండొచ్చు అయితే పోలీసులు ఒక లేఖ రాసి ఉండొచ్చు అన్నారని అయితే చంద్రబాబు రంగ ప్రవేశం చేశాక ఆ లేఖ మాయమైందని అంటున్నారని ఆమె ఆరోపించారు.
కోడెల మరణం విషయంలో కూడా ఇదే జరిగిందని ఆయన ఫోన్ రికార్డ్స్ లో కూడా చంద్రబాబు గురించి ఉందని అన్నారు. ఇప్పటికీ కోడల శివప్రసాద్ ఫోన్ ఆచూకీ లేదని అన్నారు. అలాగే ఆస్తి వివాదాల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, నా అనుమానం నీ కొడుకుని అందలం ఎక్కించడానికి నువ్వు ఏదైనా చేస్తావు అంటూ ఆమె చంద్రబాబు పై మండిపడ్డరు. ఒకవేళ నువ్వు కాకపోతే వారి సమస్య ఏమిటో ఒక కుటుంబ పెద్దగా పరిష్కరించలేవా? ఆమె సూసైడ్ నోట్ నువ్వు దొంగలించావని ప్రచారం జరుగుతోందని అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా పార్టీని బాలకృష్ణకు అప్పజెప్పి పక్కకు తప్పుకో ఈ విషయంలో ఏమీ లేదంటే నువ్వు వెంటనే సీబీఐ విచారణకు లేఖ రాయాలి, నీకు రాయడం చేతకాకపోతే నేనే సీబీఐకి లేఖలు రాస్తా, సీబీఐ క్లీన్ చిట్ ఇస్తే కానీ నిన్ను నమ్మలేను అంటూ ఆమె చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.
Also Read: Actor Chandan Kumar: తొందరపాటుకు తప్పదు మూల్యం.. సీరియల్స్ నుంచి లైఫ్ టైం బ్యాన్
Also Read: Mahesh Babu: బాలీవుడ్ ఎంట్రీపై అప్పుడలా.. ఇప్పుడిలా.. మహేష్ కు తప్పడం లేదుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook