CWG 2022: భారత దేశం గర్వపడేలా చేశాడు.. వెయిట్‌లిఫ్టర్ షూలిపై ప్రధాని ప్రశంసలు!

CWG 2022, Achinta Sheuli wins Gold In Mens 73kg.  పురుషుల 73 కేజీల విభాగంలో 20 ఏళ్ల అచింత షూలి బంగారు పతకం సాధించాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 1, 2022, 02:47 PM IST
  • భారత్‌ ఖాతాలో మరో గోల్డ్ మెడల్
  • 73 కేజీల విభాగంలో అచింత స్వర్ణం
  • భారత దేశం గర్వపడేలా చేశాడు
CWG 2022: భారత దేశం గర్వపడేలా చేశాడు.. వెయిట్‌లిఫ్టర్ షూలిపై ప్రధాని ప్రశంసలు!

PM Narendra Modi heap praise on Weightlifter Achinta Sheuli : కామ‌న్వెల్డ్ గేమ్స్‌ 2022లో భారత వెయిట్‌లిఫ్టర్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన వెయిట్‌లిఫ్టర్లు.. తాజాగా మరో మెడల్‌ను భారత్‌ ఖాతాలో వేశారు. పురుషుల 73 కేజీల విభాగంలో 20 ఏళ్ల అచింత షూలి బంగారు పతకం సాధించాడు. దాంతో భారత్‌ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. భారత్‌ ఇప్పటివరకు సాధించిన పతకాలన్నీ వెయిట్‌ లిఫ్టింగ్‌లో సాధించినవే కావడం విశేషం. స్నాచ్‌లో 143 కేజీలు, క్లీన్ అండ్ జ‌ర్క్‌లో 170 కేజీల బ‌రువు ఎత్తిన షూలి .. మొత్తంగా 313 కేజీల బ‌రువు ఎత్తి రికార్డు సృష్టించాడు. 

కామన్వెల్త్‌ గేమ్స్‌ 2022లో అచింత షూలి గోల్డ్ సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ట్వీట్ చేస్తూ... 'షూలి భారత దేశం గర్వపడేలా చేశాడు. ఏ పరిస్థితుల్లో అయినా అచింత షూలి శాంతంగా ఉంటాడు. ఈ పతకం కోసం ఎంతగానో కష్టపడ్డాడు. కామన్వెల్త్‌ క్రీడలకు వెళ్లే ముందు నేను అతడితోమాట్లాడాను. తన తల్లి, అన్నయ్య చాలా సహకారం అందించారని చెప్పాడు. పతకం సాధించాడు కాబట్టి షూలి సినిమా చూసేందుకు సయమం దొరుకుతుంది. భవిష్యత్తులో షూలి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా' పేర్కొన్నారు. 

కామన్వెల్త్‌ గేమ్స్‌కు ముందు అచింత షూలితో మాట్లాడిన వీడియోను కూడా ప్రధాని మోదీ పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో అచింతను సినిమాలు చూస్తావా అని ప్రధాని ప్రశ్నించగా.. తనకు సమయం లేదని చెప్పాడు. అందుకే ఇప్పుడు సినిమా చూసేందుకు అతడికి సయమం దొరుకుతుందని మోదీ అన్నారు. అచింత షూలి తన పతకంతో భారత దేశం గర్వపడేలా చేశాడని, కామన్వెల్త్‌ గేమ్స్‌లో మన త్రివర్ణ పతాకాన్ని మరింత ఎత్తుకు ఎగరేశాడని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. 

Also Read: J Sarathi Dead: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత!

Also Read: LPG Price Today: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

 

Trending News