Niharika Konidela Pregnancy News: మెగా ఫ్యాన్స్ అందరికీ మెగా డాటర్ నిహారిక గుడ్ న్యూస్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ లో ఒక పబ్ కేసులో పొద్దుపోయిన తర్వాత నిహారిక కనపడడంతో అది పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తరువాత కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లు కూడా డియాక్టివేట్ చేసుకుంది. ఈ మధ్యనే మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన ఆమె గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.
అదేమిటంటే త్వరలోనే నిహారిక తల్లి కాబోతున్నట్లు సమాచారం, ఆమె గర్భవతి అయిన విషయాన్ని ఆమె తన సన్నిహితులతో పంచుకున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. త్వరలోనే తాము ముగ్గురం కాబోతున్నామని ఆమె తన సన్నిహితులకు చెప్పుకున్నట్లుగా పలు వెబ్సైట్లలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మాత్రం మెగా ఫ్యామిలీ కానీ నిహారిక గాని ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు.
దీంతో ఇది నిజం కాకపోయి ఉండవచ్చని నిజంగా అలాంటి శుభవార్త ఏదైనా ఉందంటే మెగా డాటర్ కచ్చితంగా అభిమానులతో షేర్ చేసుకుంటుందని మెగా ఫాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బహుశా ఇది నిజం కాకపోయి ఉండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. సినిమా హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించిన నిహారిక తరువాత అవి కలిసి రాక పోవడంతో నిర్మాతగా పలు వెబ్ సిరీస్‌లను నిర్మించింది. ప్రస్తుతానికి ఆమె నిర్మించిన ఒక వెబ్ సిరీస్ కూడా జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కావడానికి రంగం సిద్ధమవుతోంది ఆగస్టులో హలో వరల్డ్ అనే ఒక వెబ్ సిరీస్ స్ట్రీమ్ కాబోతోంది. మొత్తం మీద నిహారిక గర్భవతి వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతున్నాయి.
Also Read: Ram Charan: రామ్ చరణ్-శంకర్ మూవీకి చిక్కులు.. నిలిపివేయాలంటూ బీజేపీ ధర్నా!
Also Read: Tollywood: టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం.. ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.