India vs West Indies: రేపటి నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈసిరీస్‌లో టీమిండియాను ఓపెనర్ శిఖర్ ధావన్ నడిపించనున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు సీనియర్లకు రెస్ట్ ఇచ్చారు. దీంతో యువ టీమ్‌తో భారత్ బరిలోకి దిగనుంది. ఇటీవల ఐర్లాండ్, శ్రీలంకతో ఆడిన జట్టునే వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు.
జులై 22న తొలి వన్డే జరగనుంది. 24న రెండో వన్డే, ఈనెల 27న మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. పొట్టి మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడు. మొదటి 20 ఈనెల 29న, రెండో మ్యాచ్ ఆగస్టు 1, మూడో టీ20 వచ్చేనెల 2న, నాలుగో మ్యాచ్ ఆగస్టు 6న, ఐదో టీ20 మ్యాచ్ ఆగస్టు 7న జరుగుతుంది. ఇప్పటికే వెస్టిండీస్ గడ్డపై టీమిండియా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది.
గతకొంతకాలంగా భారత్ ఫుల్ జోష్‌లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విశేషంగా రాణిస్తోంది. దీంతో ఈటూర్ రసవత్తరంగా జరగనుంది. వన్డేల్లో ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. టీ20ల్లో రోహిత్ శర్మ నాయకత్వ వహిస్తాడు.
Gearing up for ODI No.1 against the West Indies 💪
Here's @ShubmanGill giving a lowdown on #TeamIndia's 🇮🇳 first net session in Trinidad 🇹🇹#WIvIND pic.twitter.com/oxF0dHJfOI
— BCCI (@BCCI) July 21, 2022
టీమిండియా వన్డే జట్టు:
శిఖర్ ధావన్(కెప్టెన్), గిల్, ఇషాన్ కిషన్(కీపర్), దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, చహల్.
Also read:GVL on Polavaram: ఎవరు ఔనన్నా కాదన్నా పోలవరం పూర్తి తధ్యం..జీవీఎల్ కీలక వ్యాఖ్యలు..!
Also read:Corona Updates in India: దేశంలో కోరలు చాస్తున్న కరోనా వైరస్..తాజాగా కేసులు ఎన్నంటే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
India vs West Indies: రేపటి నుంచి భారత్, విండీస్ మధ్య వన్డే సిరీస్..టీమిండియా జట్టు ఇదే..!
రేపటి నుంచి మరో సిరీస్
భారత్, విండీస్ మధ్య వన్డే సిరీస్
ముమ్మర సాధన చేస్తున్న ఆటగాళ్లు