KTR Fan: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. రాష్ట్ర సమస్యలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందిస్తుంటారు కేటీఆర్. ఆయన ట్వీట్లకు నెటిజన్ల నుంచి మంచి రియాక్షన్ వస్తుంటుంది. ప్రముఖులు కూడా కామెంట్స్ చేస్తుంటారు. తాజా తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన జిందం సత్తమ్మను పరిచయం చేస్తున్నాంటూ ఆమె ఫోటోను షేర్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు వీరాభిమాని ఈమెనంటూ జిందం సత్తమ్మ నెటిజన్లకు పరిచయం చేశారు కేటీఆర్.
జిందం సత్తమ్మ గురించి పలు ఆసక్తికర విషయాలను తన ట్వీట్ లో చెప్పారు మంత్రి కేటీఆర్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్న జిందం సత్తమ్మ.. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో కొనసాగుతోందని తెలిపారు. ఉద్యమ సమయం నుంచే సత్తమ్మ టిఆర్‌ఎస్ పార్టీతో పాటు సీఎం కేసీఆర్ కు హార్డ్ కోర్ ఫ్యాన్ గా మారిపోయారని చెప్పారు. ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకు తనకు కూడా జిందం సత్తమ్మ మద్దతుగా ఉన్నారని ట్వీట్ లో వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి కదం తొక్కిన సత్తమ్మ ఫోటోలను తన ట్వీట్‌కు కేటీఆర్ జత చేశారు.
Let me introduce you to a very special #TRS supporter & a hardcore fan of #KCR Garu from my district; Jindam Sattamma Garu
She has been an active part of the #Telangana agitation & continues to be a pillar of support to me
Such unconditional affection & support is invaluable 🙏 pic.twitter.com/tH5YdsgAg5
— KTR (@KTRTRS) July 17, 2022
కేసీఆర్ వీరాభిమానిగా ముద్రపడిన జిందం సత్తమ్మది సిరిసిల్ల నియోజకవర్గంలోని అగ్రహారం చీర్లపంచ. స్థానిక ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఆమె నివాసం ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో నిరసన కార్యక్రమాల్లో ముందు నిలిచేది. కేసీఆర్ కూడా ఆమెను గూర్తిస్తారు. తర్వాత కేటీఆర్ కు మద్దతుగా నిలిచింది. ప్రతి ఎన్నికల్లోనూ కేటీఆర్ కోసం ఎన్నికల ప్రచారం చేసింది. జిందం సత్తమ్మను పరిచయం చేస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. సత్తమ్మ జీవితం ధన్యమైందంటూ కొందకు కామెంట్ చేశారు. మరికొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. బంగారు తెలంగాణలో సత్తమ్మకు ఏమైనా న్యాయం జరిగిందా అని మరికొందరు ప్రశ్నించారు.
Read also: TS EAMCET 2022: నేడు తెలంగాణ ఎంసెట్.. వర్షాలతో ప్రత్యేక ఏర్పాట్లు... నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
Read also: Cloud Busrt: క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటీ? ఆకస్మిక వరదలు స్పష్టించడం సాధ్యమా? గోదావరిపై కుట్ర జరిగిందా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
KTR FAN: కేసీఆర్ వీరాభిమానిని పరిచయం చేసిన కేటీఆర్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..
మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
జిందం సత్తమ్మ ఫోటోలు షేర్ చేసిన కేటీఆర్
కేసీఆర్ వీరాభిమాని అంటూ పరిచయం