F3 movie gets OTT Release Date: స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా 'ఎఫ్ 3'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్‌లు ఈ సినిమాను నిర్మించారు. గ్లామర్ బ్యూటీలు తమన్నా భాటియా, మెహ్రీన్ ఫిర్జాదా కథానాయికలు. 2019లో సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 వచ్చింది. భారీ అంచనాల మధ్య మే 27న విడుదలైన ఎఫ్ 3.. సీక్వెల్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ప్రేక్షకులను అలరించింది.
హాట్ సమ్మర్‌లో అనిల్ రావిపూడి మరోసారి ఆడియెన్స్‌ను థియేటర్లలో హాయిగా నవ్వుకునేలా చేశాడు. ఎఫ్ 2 మాదిరిగానే సీక్వెల్‌లో వెంకటేష్ కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఎఫ్ 3 పోటీగా కమల్ హాసన్ నటించిన విక్రమ్, అడవి శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన మేజర్ చిత్రాలు హిట్ కొట్టడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
ఎఫ్ 3 సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో రిలీజ్ కానుంది. జూలై 22 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. చిత్ర యూనిట్ ఇదివరకు చెప్పిన ప్రకారమే.. ఎఫ్ 3 విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఇటీవలి కాలంలో సినిమాలు అన్ని దాదాపుగా నెలలోపే ఓటీటీలోకి వస్తున్నాయి. అలాంటిది ఈ సినిమా 8 వారాల తర్వాత ఓటీటీలోకి రావడం విశేషం. ఎఫ్ 3 సినిమా టికెట్స్ రేట్స్ యథాతథంగా విషయం తెలిసిందే.
Be prepared for a hilarious journey with @VenkyMama,@IAmVarunTej, @tamannaahspeaks, @hegdepooja and @Mehreenpirzada. Watch F3 on #SonyLIV from 22nd July. #F3OnSonyLIV@AnilRavipudi @ThisIsDSP @Mee_Sunil @sonalchauhan7 @adityamusic @SVC_official pic.twitter.com/VBD37Y7PCO
— SonyLIV (@SonyLIV) July 11, 2022
ఎఫ్ 3 సివిమలో వెంకటేష్, వరుణ్‌లకు జోడీగా తమన్నా, మెహరిన్‌లు కథానాయికలుగా నటించారు. వీరి కామెడీ బాగుంది. సునీల్, సోనాల్ చౌహన్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఇక బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేశారు. మొత్తానికి ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ప్రేక్షకులకు అందాల విందు చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయింది.
Also Read: Ashu Reddy: బీచ్ సైడ్ పార్టీలో పొట్టి బట్టల్లో అషు రెడ్డి రచ్చ.. నెవర్ బిఫోర్ అనిపించేలా!
Also Read: మణిరత్నం సినిమానే వదులుకున్న కీర్తి సురేశ్.. కారణం ఏంటో తెలుసా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
F3 OTT: ఎనిమిది వారాలకు ఓటీటీలోకి 'ఎఫ్ 3'.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఎఫ్ 3
స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?
8 వారాల తర్వాత