CM Jagan Review: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు సీఎం వైఎస్ జగన్. ఆప్షన్-3 కింద ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్..జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై చర్చించారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన వనరులన్నీ కాలనీల్లో ఉండేలా చూడాలన్నారు.
ఈనెలాఖరులోగా కోర్టు కేసుల వివాదాల్లోని ఇళ్ల పట్టాలపై స్పష్టత కోసం ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఆగస్టు మొదటి వారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధం కావాలన్నారు. జగనన్న కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన పెద్దపీట వేయాలని చెప్పారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండొద్దని స్పష్టం చేశారు. కాలనీలో మనం నిర్మించేది ఇళ్లు కాదని..ఊళ్ల విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు.
90 రోజుల్లో పట్టాల పంపిణీపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులకు ఇంటి స్థలం చూపించడమే కాదు..దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అందించాలని అధికారులను ఆదేశించారు. స్థలం, పత్రాలు ఇచ్చిన విషయాన్ని లబ్ధిదారుల నుంచి తెలుసుకోవాలన్నారు. ఈసమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, సీఎస్ సమీర్ శర్మతోపాటు గృహ నిర్మాణ శాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
Also read:Indrakeeladri: ఇంద్రకీలాద్రిపైకి వాహనాలకు నో ఎంట్రీ..దుర్గగుడి ఈవో కీలక నిర్ణయం..!
Also read:Chandrababu: ఎన్డీయేలో టీడీపీ చేరబోతోందా..రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీ స్టాండ్ ఇదే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook