/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Pawan Kalyan: భారతీయ జనతా పార్టీ పొత్తుకు జనసేన కటీఫ్ చెప్పనుందా? కేంద్రం పెద్దలకు పవన్ కల్యాణ్ క్లియర్ గా చెప్పేశారా? అంటే ఏపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం సభకు పవన్ కల్యాణ్ రాకపోవడంతో బీజేపీకి జనసేన గుడ్ బై చెప్పడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాని మోడీ పర్యటనకు జనసేన చీఫ్ కు ఆహ్వానం వచ్చింది. ప్రధాని వచ్చిన భీమవరం పవన్ కల్యాణ్ సొంత జిల్లా. గత ఎన్నికల్లో భీమవరం నుంచే అసెంబ్లీకి పోటీ చేశారు జనసేన చీఫ్. తన సొంత గడ్డకు ప్రధాని వచ్చినా పవన్ రాకపోవడం.. అందులో ప్రత్యేక ఆహ్వానం ఉన్నా కనీసం అటువైపు చూడకపోవడం సంచలనంగా మారింది. బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని డిసైడ్ అయినందు వల్లే ప్రధాని మోడీ భీమవరం పర్యటనలో పవన్ కల్యాణ్ పాల్గొనలేదని తెలుస్తోంది.

కొంత కాలంగా ఏపీలో పొత్తుల చుట్టే రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ-జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. అయితే వైసీపీ సర్కార్ ను ఓడించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండూ చూస్తామని జనసేన ఆవిర్భావ సభలో పవన్ కామెంట్ చేశారు. దీంతో జగన్ టార్గెట్ గా విపక్షాలన్ని ఏకమవుతాయనే ప్రచారం సాగింది. 2014 తరహాలో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి దిశగా అడుగులు పడుతున్నాయని సంకేతం వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పొత్తులపై పవన్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తూ మాట్లాడారు. అంతేకాదు పొత్తుల కోసం త్యాగాలకు కూడా సిద్దంగా ఉన్నామని చెప్పారు. టీడీపీ నేతలు కూడా జనసేనతో పొత్తు ఉంటే తమకు తిరుగు ఉండదంటూ కామెంట్లు చేశారు. అయితే పవన్ విపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తుడంగా.. జనసేన మిత్రపక్షం బీజేపీ వైఖరి మాత్రమ మరోలా ఉంది. టీడీపీతో పొత్తుకు ఆ పార్టీ హైకమాండ్ సానుకూలంగా లేదని తెలుస్తోంది. అందుకే టీడీపీ పొత్తు విషయంలో  ఏపీ బీజేపీ నేతలు సైలెంట్ గా ఉంటున్నారు.

టీడీపీ పొత్తు విషయంలో జనసేన, బీజేపీ మధ్య గ్యాప్ రాగా.. అదే సమయంలో ఏపీ సీఎం జగన్ కు కేంద్రం పెద్దలు ప్రాధాన్యత పెంచారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థికే వైసీపీ మద్దతు
ఇచ్చింది. నెలల్లోనే రెండు సార్లు జగన్ కు ఢిల్లీకి పిలుపించుకుని మాట్లాడారు ప్రధాని మోడీ. ఏపీ సర్కార్ కు ఆర్థికంగా కేంద్ర సాయం చేస్తోంది. ఇవన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్.. బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. తాము ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న జగన్ తో బీజేపీ పెద్దలు రాసుకుపూసుకుని తిరగడాన్ని జనసేనాని తట్టుకోలేకపోతున్నారని తెలుస్తోంది. కొంత కాలంగా జగన్ ను, వైసీపీ సర్కార్ ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తున్నారు పవన్. అటు వైసీపీ నేతలు చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ పవన్ ను ఆటాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ తో బీజేపీ హైకమాండ్ సఖ్యతగా ఉండటంతో.. బీజేపీకి కటీఫ్ చెప్పాలని పవన్ దాదాపుగా డిసైడ్ అయ్యారని అంటున్నారు. అందుకే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఆహ్వానించినా భీమవరం ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉన్నారని జనసేన నేతలు చెబుతున్నారు.

మరోవైపు భీమవరం అల్లూరి జయంతి వేడుకలో ప్రధాని మోడీతో పాటు సీఎం జగన్ కూడా ఉన్నారు. సభకు హాజరైతే జగన్ తో కలిసి వేదిక పంచుకోవాల్సి ఉంటుంది. అది ఇష్టం లేకే పవన్ కల్యాణ్ ప్రధానమంత్రి పర్యటనకు డుమ్మా కొట్టారనే వాదన వస్తోంది. ప్రధాని పర్యటనకు వెళ్లకుండా తన భవిష్యత్ కార్యాచరణను పవన్ వెల్లడించారని అంటున్నారు. ప్రధాని మోడీ గారు మీతో మాకు కుదరదు.. ఇక మా దారి మేము చూసుకుంటామనే సంకేతాన్ని పవన్ కల్యాణ్ ఇచ్చారంటున్నారు. భీమవరం సభలోనే మరో కీలక పరిణామం జరిగింది. టీడీపీకి ఆహ్వానం వచ్చినా ఆ పార్టీ నుంచి ఎవరూ వెళ్లలేదు. ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడును పంపిస్తామని చంద్రబాబు రెండు రోజల క్రితం చెప్పారు. కాని వేదికపై అచ్చెన్న కనిపించలేదు. ప్రధాని మోడీ సభకు పవన్ వెళ్లడం లేదన్న సమాచారం రావడంతో అచ్చెన్నను వెళ్లవద్దని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. దీంతో బీజేపీ ఆహ్వానాన్ని తిరస్కరించిన టీడీపీ-జనసేన పార్టీలు.. తాము వచ్చే ఎన్నికల్లో  కలిసి పోటీ చేస్తాయనే సంకేతం ఇచ్చాయంటున్నారు.

Read also: CM Jagan: అల్లూరి అంటే పేరు కాదు..మహా అగ్నికణం..విగ్రహావిష్కరణలో సీఎం జగన్..!  

Read also:  Roja Selfie with Modi: ప్రధాని మోడీ సభలో మంత్రి రోజా హల్చల్.. ఏం చేసిందో తెలుసా?  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Section: 
English Title: 
Janasena Chief Pawan Kalyan Ready To Break Allaince With BJP In Andhra Pradesh
News Source: 
Home Title: 

Pawan Kalyan:మోడీ గారు మీతో కుదరదంతే..!భీమవరం సాక్షిగా బీజేపీతో పవన్ కల్యాణ్ కటీఫ్?

Pawan Kalyan: ప్రధాని మోడీ గారు మీతో కుదరదంతే..! భీమవరం సభ సాక్షిగా బీజేపీతో పవన్ కల్యాణ్ కటీఫ్?
Caption: 
FILE PHOTO PAWAN KALYAN
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ప్రధాని మోడీ సభకు పవన్ డుమ్మా

మోడీ, జగన్ తో వేదిక పంచుకోని జగన్

బీజేపీ పొత్తుకు జనసేన కటీఫ్?

Mobile Title: 
Pawan Kalyan:మోడీ గారు మీతో కుదరదంతే..!భీమవరం సాక్షిగా బీజేపీతో పవన్ కల్యాణ్ కటీఫ్?
Srisailam
Publish Later: 
No
Publish At: 
Monday, July 4, 2022 - 14:36
Request Count: 
121
Is Breaking News: 
No