Pushpa The Rule Auditions: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా తెలుగు భాషలోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా విడుదలైంది. ఈ సినిమా మిగతా నాలుగు భాషల్లో ఎంత కలెక్షన్స్ సాధించిందో అంతే కలెక్షన్స్ ఒక హిందీలోనే రాబట్టడం ఈ సినిమాకు నార్త్ లో ఏర్పడిన క్రేజ్ ఎలాంటిదో అర్థమయ్యేలా చేస్తుంది. ఒక సాధారణ ఎర్రచందనం చెట్లు కొట్టే కూలీ ఒక ఎర్రచందనం స్మగ్లింగ్ డాన్ గా ఎలా ఎదిగాడనే విషయాన్ని సుకుమార్ ఆసక్తికరంగా మలిచారు. ఈ సినిమా అనుకున్నప్పుడు ఒక భాగంగానే విడుదల చేయాలని అనుకున్నారు.
కానీ సినిమా ప్రారంభించిన తర్వాత నిడివి అంతకంతకు పెరుగుతూ వెళ్లడంతో రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ అనే పేరుతో గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేశారు. ఈ సినిమాకి అద్భుతమైన స్పందన వచ్చిన నేపథ్యంలో రెండో భాగం మీద దృష్టి పెట్టిన నిర్మాతలు రెండో భాగాన్ని మరింత ఆసక్తికరంగా భారీ బడ్జెట్ తో నిర్మించాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు సుకుమార్ కొంత మేర కథ కూడా మార్చారనే ప్రచారం జరిగింది కానీ ఆ విషయం మీద క్లారిటీ లేదు. ఇప్పటికే హైదరాబాదులో ఒకసారి ఆడిషన్స్ నిర్వహించిన సినిమా యూనిట్ ఇప్పుడు చిత్తూరు యాసలో మాట్లాడే వారి కోసం తిరుపతిలో ఆడిషన్స్ నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది.
తిరుపతి బాలాజీ నగర్ లోని ఒక స్కూల్లో ఆడిషన్స్ నిర్వహిస్తామని చిత్తూరు యాసలో మాట్లాడే వారందరూ ఈ ఆడిషన్స్ కి హాజరై తమ లక్కు పరీక్షించుకోవాలని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తమ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. వారు ప్రకటించిన దాని మేరకు మెక్ మై బేబీ జీనియస్ అనే స్కూల్ లో, జూలై 3,4,5 తేదీల్లో అన్ని వయసుల వారికీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్ జరగనున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు చిత్తూరు స్లాంగ్ మాట్లాడగలిగితే! మీకు నటించాలని ఆసక్తి ఉంటే మీరు కూడా బన్నీ సినిమాలో భాగమయ్యే అవకాశం మైత్రి మూవీ మేకర్ సంస్థ కల్పించింది. ఒక ప్రయత్నం చేసి చూడండి మరి.
Also Read:July 1st OTT Releases: విరాటపర్వం టు ధాకడ్.. నేడు ఏయే సినిమాలు, సిరీసులు రిలీజయ్యాయంటే?
Also Read:Pakka Commercial Movie Review: గోపీచంద్- రాశిఖన్నాల సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook