Meena Husband Vidyasagar's Death News : మీనా భర్త విద్యాసాగర్ మృతి ఇటు టాలీవుడ్‌తో పాటు అటు కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ తీవ్ర విషాదం నింపింది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల నుంచి సినీ ప్రముఖులు మీనా ఇంటికి చేరుకుని విద్యాసాగర్‌కి నివాళి అర్పించి ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
Meena Husband Vidyasagar's Death News : ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (జూన్ 28) రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. విక్టరీ వెంకటేశ్, మంచు లక్ష్మీ, ఖుష్బూతోపాటు పలువురు సినీ తారలు విద్యాసాగర్ మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు