Garuda Puran: ఎంత కష్టపడి పనిచేసినా మీ చేతిలో డబ్బు నిలవట్లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి

Garuda Puran: కష్టపడి పనిచేసినా మీ చేతిలో డబ్బు నిలవట్లేదా? అయితే ఈ సమస్యకు పరిష్కారం గరుడ పురాణంలో దాగి ఉంది. మీరు కేవలం 4 చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను బయటపడవచ్చు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 28, 2022, 01:18 PM IST
  • గరుడ పురాణంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి
  • డబ్బు చేతిలో ఉండటానికి కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి
Garuda Puran: ఎంత కష్టపడి పనిచేసినా మీ చేతిలో డబ్బు నిలవట్లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి

Garuda Puran: ప్రతి ఒక్కరూ తమ జీవితం ఏ లోటు లేకుండా ఆనందంగా ఉండాలనుకుంటున్నారు. అయితే కొంతమందికి మాత్రమే ఈ కోరిక నెరవేరుతుంది. మరికొంత మంది ఎంత కష్టపడినా వారి ఈ కోరిక ఎప్పటికీ నెరవేరదు. మనం తెలిసో తెలియకో చేసే తప్పుల వల్ల లక్ష్మిదేవి (Goddess Lakshmi) కోపం వచ్చి మన చేతుల్లోకి వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతూ ఉంటుంది. ఇలాంటి కష్టాల నుండి బయటపడటానికి చిట్కాలు గరుడ పురాణంలో చెప్పబడ్డాయి. అలాగే జీవన్మరణ రహస్యం గరుడ పురాణంలో (Garuda Puran) చెప్పబడింది. మీరు ఎలా ధనవంతులు అవుతారో కూడా ఈ పురాణంలో చెప్పబడింది. 

అవసరమైన వారికి దానం చేయండి
సనాతన ధర్మం దానధర్మాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. ఏ శుభ కార్యమైనా దానం ఇవ్వనంత వరకు దాని పుణ్యము లభించదు. కావున, మీరు శ్రీమహావిష్ణువు మరియు తల్లి లక్ష్మి అనుగ్రహం పొందాలనుకుంటే, తప్పనిసరిగా అవసరమైన వారికి ఆహారం మరియు నీరు దానం చేయండి.

ఆస్తి, అహంకారానికి దూరంగా ఉండండి
ఐశ్వర్యం మరియు సంపద అనేది ఎవరికీ శాశ్వతం కాదు. ఇవి ఈరోజు ఒక వ్యక్తి వద్ద ఉంటాయి. మరుసటి రోజు మరొకరి వద్దకు వెళుతుంది. సంపద, ఆస్తి విషయంలో అహంకారం ఉండకూడదని, గర్వంతో ఎవరినీ అవమానించకూడదని గరుడ పురాణంలో చెప్పబడింది. ఆస్తి గర్వంతో కోపంతో వెళ్లిపోయే వారిపై మా లక్ష్మి ఎప్పుడూ తన దీవెనలు కురిపించదు.

ఆహారంలో మొదటి భోగాన్ని దేవునికి సమర్పించండి.
గరుడ పురాణం ప్రకారం, ఆహారం తయారుచేసినప్పుడల్లా మొదటి భోగాన్ని భగవంతుడికి సమర్పించాలని చెప్పబడింది. ఇలా చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారు. దేవుడికి నైవేద్యం పెట్టకుండా సొంతంగా భోజనం చేసి కూర్చుంటే పాపం పెరిగిపోయి ఇంట్లో దరిద్ర వాతావరణం మొదలవుతుంది. దీంతో పాటు ఇంట్లో అశాంతి, కష్టాలు కూడా పెరుగుతాయి.

ప్రతిరోజూ మత గ్రంథాలను పఠించండి
భారతదేశంలోని మత గ్రంథాలలో విజ్ఞాన రహస్యాలు దాగి ఉన్నాయి. ఇలాంటి అనేక విషయాలు వీటిలో చెప్పబడ్డాయి. వీటిని పాటిస్తే అతని జీవితం విజయవంతమవుతుంది. మానసిక ప్రశాంతతను పొందేందుకు మరియు సరైన మార్గం కనుగొనడానికి.. రామాయణం, మహాభారతం, గరుడ పురాణం చదువుతూ ఉంటే మంచిది. ఈ పుస్తకాల ద్వారా భగవంతుని స్మరణ కూడా ఏకకాలంలో సాగుతుంది. అందుకే వాటిని ఎప్పటికీ వదులుకోకూడదు.

Also Read: Vastu Tips: ఇంట్లో ఆ ఐదు వస్తువుల్ని ఉంచితే..రాత్రికిరాత్రి బికారులవడం ఖాయం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News