Srilankan Airlines: శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూఎల్ 504 విమానం ఈనెల 13న లండన్ నుంచి కొలంబోకు పయనమైంది. ఇందులో 275 మంది ప్రయాణికులు ఉన్నారు. తుర్కియే గగనతలంలో 33 వేల అడుగుల ఎత్తులో విమానం వెళ్తోంది. ఈక్రమంలోనే 35 వేల అడుగుల ఎత్తుకు ఎగరాలని అంకారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) నుంచి సందేశం వచ్చింది. అదే ఎత్తులో అతి దగ్గర్లో 15 మైళ్ల దూరంలో మరో విమానం వస్తున్నట్లు శ్రీలంక విమాన పైలట్లు గ్రహించారు.
ఈ విషయాన్ని ఏటీసీ కేంద్రానికి తెలిపారు. ఐనా వారు పైకి ఎగరాలని పలుమార్లు ఆదేశాలు వచ్చాయి. ఏటీసీ సందేశాన్ని పట్టించుకోకుండా ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పైలట్లు 35 వేల అడుగుల ఎత్తులో వెళ్లేందుకు నిరాకరించారు. 33 వేల అడుగుల ఎత్తులోనే ముందుకు వెళ్లారు. వెంటనే పొరపాటును గుర్తించి తేరుకున్న ఏటీసీ కేంద్రం పైకి ఎగరవద్దని..అదే ఎత్తులో బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం దుబాయ్‌కు వెళ్తోందని తెలిపారు.
ఆ విమానంలో 250 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏటీసీ వ్యవస్థ ఆదేశాలతో అలాగే వెళ్లి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది. 525 మంది ప్రాణాలు గాలిలో కలిపిపోయేవి. రెండు విమానాలు ఢీకొనే పరిస్థితి నుంచి కాపాడిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ పైలట్ల తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తవుతోంది. వారిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Also read: Corona Updates in India: భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా వైరస్..తాజాగా కేసులు ఎన్నంటే..!
Also read: India vs South Africa: రేపే నాలుగో టీ20 మ్యాచ్..టీమిండియాకు భారీ షాక్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook