Sunday Puja Tips: ఆదివారం ఈ విధంగా ఉపవాసం చేస్తే.. సూర్య భగవానుడు అనుగ్రహిస్తాడు! ఇక మీ ఇంట కాసుల పంటే..!

Sunday Puja Tips: ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఈ దినాన భక్తులు సూర్య భగవానుని ఆరాధిస్తూ.. ఉపవాసం చేస్తారు. తద్వారా వారు అనుకున్నది సిద్ధిస్తోందని వారి నమ్మకం.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 12, 2022, 11:24 AM IST
Sunday Puja Tips: ఆదివారం ఈ విధంగా ఉపవాసం చేస్తే.. సూర్య భగవానుడు అనుగ్రహిస్తాడు! ఇక మీ ఇంట కాసుల పంటే..!

Raviwar Remedies: హిందూ మతంలో వారంలోని అన్ని రోజులు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడ్డాయి. ఈరోజు అనగా ఆదివారం నాడు సూర్య భగవానుని (Surya dev) పూజిస్తారు. సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది ఆదివారాలు కూడా ఉపవాసం పాటిస్తారు. సూర్య భగవానుడు విశ్వానికి ఆత్మ అని అంటారు. ప్రజలు సూర్య భగవానుని వివిధ రకాలుగా పూజిస్తారు. కొంత మంది ఆయనకు నీటిని సమర్పిస్తారు. ఆదివారం నాడు సూర్య భగవానుడు ఉపవాసం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. 

సూర్య భగవానుని ఆరాధన
ఆదివారాలు ఉపవాసం (Sunday Fasting) చేయడం వల్ల సూర్యుని అశుభాలు తగ్గుముఖం పట్టడంతోపాటు సూర్యుడు దృఢంగా ఉంటాడని చెబుతారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆయురారోగ్యాలు, శుభాలు కలుగుతాయి. దీనితో పాటు, అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ ఉపవాసం చర్మ మరియు కంటి రుగ్మతలను కూడా నాశనం చేస్తుంది. 

ఉపవాసం ఈ విధంగా చేయండి
>> ఏ నెలలోనైనా శుక్ల పక్షం మొదటి ఆదివారం నుండి ఉపవాసాన్ని ప్రారంభించి ఒక సంవత్సరం లేదా 21 లేదా 51 ఆదివారాలు చేయండి.
>>  ఆదివారం తెల్లవారుజామున తలస్నానం చేసిన తరువాత ఎర్రని వస్త్రాలు ధరించి.. నుదుటికి ఎర్రచందనం తిలకం పూసుకోండి. అనంతరం రాగి కలశంలో నీరు తీసుకుని అందులో రోలి, అక్షత, ఎర్రని పూలు పోసి పూజాభిషేకాలు చేస్తూ సూర్యనారాయణుడికి అర్ధ్యం సమర్పించాలి. దీనితో పాటు, బీజ్ మంత్రాన్ని జపించండి. 
>>  సూర్యాస్తమయానికి ముందు ఆహారం తీసుకోండి. గోధుమ రొట్టె లేదా గోధుమ గంజి లాంటివి తీసుకుంటే మంచిది. ఆహారంలో ఉప్పును ఎప్పుడూ ఉపయోగించవద్దు.
>>  చివరి ఆదివారం ఉపవాసం పాటించాలని శాస్త్రంలో పేర్కొనబడింది. ఉద్యాపనలో యోగ్యత కలిగిన బ్రాహ్మణుని ద్వారా హవనాన్ని పొందండి. అర్హులైన దంపతులకు ఆహారాన్ని అందించిన తర్వాత, హవనాన్ని ఆచరించిన తర్వాత, కోరుకున్నట్లు ఎర్రని వస్త్రాలు మరియు దక్షిణ అందించండి. ఈ విధంగా మీ సూర్య వ్రతం సంపూర్ణంగా పరిగణించబడుతుంది.

Also Read: Astrology: జాతకంలో ఉన్న గ్రహ దోషాలు పోవాలంటే... ఈ శక్తివంతమైన మంత్రాలు జపించండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News