ROJA COMMENTS: జెండా పీకేయడం ఖాయం.. పవన్ కల్యాణ్, అచ్చెన్నపై రోజా హాట్ కామెంట్స్

ROJA COMMENTS: ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిస్టర్ ఆర్కే రోజా మరోసారి ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ తో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషం ఉన్నారన్నారు రోజా.

Written by - Srisailam | Last Updated : Jun 11, 2022, 10:44 AM IST
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై ఫైర్
  • పవన్ బస్సు యాత్ర ఎవరికోసం- రోజా
ROJA COMMENTS: జెండా పీకేయడం ఖాయం.. పవన్ కల్యాణ్, అచ్చెన్నపై రోజా హాట్ కామెంట్స్

ROJA COMMENTS: ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిస్టర్ ఆర్కే రోజా మరోసారి ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ తో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషం ఉన్నారన్నారు రోజా. ఎలాంటి కోతలు లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పారు. అర్హులందరికి ఎలాంటి లంచం ఇవ్వాల్సిన పని లేకుండా ఇంటి దగ్గరకే వచ్చి పథకాలు వాలంటీర్లు అందిస్తున్నారని తెలిరారు. ప్రజలు సంతోషం ఉండటం చూడలేక చంద్రబాబు, లోకేష్ ఏడుస్తున్నారని రోజా విమర్శించారు. జగన్ పాలనను చూడలేక అడ్డగోలు ఆరోపణలు చేస్తూ దొంగ అరుపులు అరుస్తున్నారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి రోజా.

పదవ తరగతి ఫలితాలపై పైనా నీచ రాజకీయం చేస్తున్నారని రోజా ఆరోపించారు. పిల్లలతో రాజకీయం చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. జూమ్ మీటింగ్ లు పెట్టి ఫెయిల్ అయిన విద్యార్థులతో మీటింగ్ పెట్టడం దారుణమన్నారు. జూమ్ మీటింగ్ లోకి కొడాలి నాని వెళ్లడంతో లోకేష్ పారిపోయారని రోజా విమర్శించారు. అబ్బద్దలు చెప్పడం కాదు... మా ప్రభుత్వానిది తప్పే అయితే జూమ్ మీటింగ్ లో వచ్చిన మా లీడర్స్ ను నిలదీసి ఉండాల్సిందని అని రోజా అన్నారు. అచ్చం నాయుడు వాలకం చూస్తుంటే అడ్డంగా పెరిగాడు కానీ బుర్రలేదంటూ హాట్ కామెంట్స్ చేశారు రోజా.  టీడీపీ గెలువకుంటే పార్టీని భూస్థాపితం చేస్తామని అచ్చెన్న ఓపెన్ గానే చెప్పారన్నారు. తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు, లోకేష్ పై అచ్చెంనాయుడికి ఎంత కోపం ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు ఏపీ మంత్రి రోజా.

పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేసే ముందు ఒక స్పష్టత ఉండాలన్నారు రోజా. జనసేన కార్యకర్తల కోసమా లేక ప్రజల కోసమా అనే క్లారిటీ ఇవ్వాలన్నారు. చంద్రబాబుకి కష్టం వస్తే పవన్ కళ్యాణ్ బయటకు వస్తారని రోజా విమర్శించారు. దమ్ము దైర్యం ఉంటె టీడీపీ మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టోను పోల్చిచూస్తే ప్రజలు ఎవరి పక్షాన ఉంటారో పవన్ కు తెలుస్తుందన్నారు.
పోటి చేసిన రెండు చోట్ల ఓడిపోయినా పవన్ కళ్యాణ్ కు,  మంత్రి అయి ఎమ్మెల్యే కానీ లోకేష్ కు సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు 23 సీట్లకే పరిమితం చేశారని రోజా విమర్శించారు. కుప్పంలో కూడా టీడీపీ గెలిచే పరిస్థితి లేదన్నారు. తెలంగాణాలో భూస్థాపితం అయిన టీడీపీ.... ఏపీలో మూతపడటం ఖాయమన్నారు రోజా. వైసీపీలో కషపడి పనిచేసిన వారంతా ప్రజా ప్రతినిధులు అయ్యారని చెప్పారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తుంటే జనం హారతి పట్టి స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. 

Read also: Covid-19 Fourth Wave: దేశంలో కొవిడ్ కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు.. ఫోర్త్ వేవ్ అలర్ట్?  

Read also: Hyderabad Gang Rape Case: పోలీస్ కస్టడీకి ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు.. బాలికను దారుణంగా హింసించిన నిందితులు!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News