Kamal Haasan take home Rs.50 Crores Remuneration for Vikram Movie: కమల్ హాసన్.. ఈ పేరుకు ప్రత్యకంగా పరిచయం అక్కర్లేదు. తన నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఆయనకు లక్షల్లో ఫాన్స్ ఉన్నారు. విలక్షణ నటుడు, లోకనాయకుడు అనే బిరుదులు అయన సొంతం. కమల్ హాసన్ ఎన్నో హిట్ చిత్రాలలో నటించారు. మరో చరిత్ర, ఎర్ర గులాబీలు, ఆకలి రాజ్యం, వసంత కోకిల, సాగర సంగమం, స్వాతిముత్యం, పుష్పక విమానం, నాయకుడు, భారతీయుడు, దశావతారం, విశ్వరూపం లాంటి భారీ హిట్ సినిమాలు కమల్ ఖాతాలో ఉన్నాయి.
తాజాగా కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'విక్రమ్'. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. హీరో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి కమల్ హాసన్ ఈ సినిమాని నిర్మించారు. విక్రమ్ సినిమా జూన్ 3న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కమల్ రెమ్యునరేషన్ ఓసారి చూద్దాం.
ఫిల్మీ దునియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం మేరకు విక్రమ్ సినిమా బడ్జెట్ రూ.120 కోట్ల పైనే ఉంటుందట. ఈ సినిమా కోసం కమల్ హాసన్ ఏకంగా రూ.50 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కమల్ మార్కెట్ భారీగా ఉన్నందునే ఇంత మొత్తం ఇవ్వడానికి నిర్మాత ఒప్పుకున్నాడట. విక్రమ్ చిత్రం కోసం డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దాదాపు రూ.8 కోట్లు తీసుకుంటే.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ రూ. 4 కోట్లు తీసుకున్నారట.
స్టార్ హీరో విజయ్ సేతుపతికి రూ.10 కోట్లు.. ఫహద్ ఫాజిల్‌కు రూ.4 కోట్ల మేర పారితోషికం అందినట్టు తెలుస్తోంది. మిగతా నటీనటులకు అందరికి కలిపి ఇంకో రూ.4 కోట్లు అయిందట. ఈ సినిమాలో కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్ మరియు శివాని నారాయణన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2018లో విశ్వరూపం 2 సినిమాతో కమల్ హాసన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత విక్రమ్ సినిమా విడుదల అవుతుండడంతో ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
Also Read: Singer KK: సింగర్ కేకే హోటల్ గదిలో యాంటాసిడ్స్.. లైవ్ షోకి ముందు భార్యకు ఫోన్ చేసి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook